మరో మెగా హీరోతో మెహరీన్ | Mehreen to Romance Varun Tej | Sakshi
Sakshi News home page

Jan 3 2018 1:01 PM | Updated on Jan 3 2018 1:01 PM

Mehreen to Romance Varun Tej - Sakshi

కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన మెహరీన్, కెరీర్ స్టార్టింగ్ లో కాస్త స్లోగా అనిపించినా.. తరువాత వరుస సినిమాలతో బిజీ అయ్యింది. గత ఏడాది మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాలతో మంచి హిట్ లు అందుకున్న ఈ భామ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సరసన జవాన్ సినిమాలోనూ మెరిసింది.

తాజాగా సమాచారం ప్రకారం ఈ భామ కొత్త ఏడాదిలో మరో మెగా హీరో సరసన నటించేందుకు అంగీకరించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడిగా మెహరీన్ నటించనుంది. ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్‌)  పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement