భయం వేసింది! | Megha Akash's Instagram Account Hacked | Sakshi
Sakshi News home page

భయం వేసింది!

Feb 6 2019 3:37 AM | Updated on Apr 3 2019 8:07 PM

Megha Akash's Instagram Account Hacked - Sakshi

మేఘా ఆకాశ్‌

కథానాయిక మేఘా ఆకాశ్‌ పేరు మారింది. ఒక్క నిమిషం... ఆమె మార్చుకోలేదు. హ్యాకర్స్‌ మార్చారు. అవును.. మేఘా ఆకాశ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను హ్యాకర్స్‌ హ్యాక్‌ చేసి రష్యాకి చెందిన ఓ డీజే ఆర్టిస్టు పేరు పెట్టారు. అంతటితో ఆగకుండా కొన్ని అభ్యంతరకరమైన ఫొటోలను కూడా అప్‌లోడ్‌ చేశారు. అయితే ఆ ఫొటోలు మేఘా ఆకాశ్‌వి కాదు. ఈ విషయంపై మేఘా ఆకాశ్‌ స్పందించారు. ‘‘నా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను హ్యాక్‌ చేశారు. మా టీమ్‌ చాలా కష్టపడి మళ్లీ నా అకౌంట్‌ యాక్సెస్‌ను తిరిగి తెచ్చారు.

కానీ నా వ్యక్తిగత ఖాతాను హ్యాకర్స్‌ హ్యాక్‌ చేయడంతో చాలా భయం వేసింది. నాకు సపోర్ట్‌ చేసిన అందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు. ఇటీవల కమల్‌హాసన్‌ చిన్న కుమార్తె అక్షరా హాసన్, హీరోయిన్‌ హన్సిక సోషల్‌ మీడియా అకౌంట్స్‌ కూడా హ్యాక్‌ అయిన విషయం తెలిసిందే. ఇలా వరుసగా హీరోయిన్ల సోషల్‌ మీడియా ఖాతాలు హ్యాక్‌ అవుతుండటం గమనించాల్సిన విషయం. ఇక మేఘా సినిమాల విషయానికి వస్తే... ఇటీవల రజనీకాంత్‌ ‘పేట’ సినిమాలో కీలక పాత్ర చేసిన ఈ బ్యూటీ ‘శాటిలైట్‌ శంకర్‌’ అనే సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement