చరణ్ను భయపెడుతున్న మెగా సెంటిమెంట్ | Mega Powerstar Ram Charan Fans In Tension | Sakshi
Sakshi News home page

చరణ్ను భయపెడుతున్న మెగా సెంటిమెంట్

Nov 24 2016 12:39 PM | Updated on Mar 22 2019 5:33 PM

చరణ్ను భయపెడుతున్న మెగా సెంటిమెంట్ - Sakshi

చరణ్ను భయపెడుతున్న మెగా సెంటిమెంట్

రామ్చరణ్ హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ధృవ. తమిళ సూపర్ హిట్ సినిమా తనీ ఒరువన్కు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై చెర్రీ చాలా ఆశలు...

రామ్చరణ్ హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ధృవ. తమిళ సూపర్ హిట్ సినిమా తనీ ఒరువన్కు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై చెర్రీ చాలా ఆశలు పెట్టుకున్నాడు. బ్రూస్లీ సినిమాకు డిజాస్టర్ టాక్ రావటంతో ఈ సినిమాను సూపర్ హిట్గా నిలిపి, తిరిగి సత్తా చాటాలని భావిస్తున్నాడు. అందుకు తగ్గట్టు న్యూ లుక్లో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు చెర్రీ. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ధృవ సినిమాను డిసెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

అయితే ఈ రిలీజ్ డేటే ఇప్పుడు చిత్రయూనిట్ను మెగా అభిమానులను కలవరపెడుతోంది. డిసెంబర్లో రిలీజ్ అయిన మెగా హీరోల సినిమాలేవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన పంజా, వరుణ్ తేజ్ హీరోగా పరిచయం అయిన ముకుందా, వరున్ రెండో సినిమా లోఫర్లు డిసెంబర్ నెలలోనే రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలేవి మెగా స్టామినాను ప్రూవ్ చేసే స్థాయిలో ఆకట్టుకోలేదు. ఇప్పుడు అదే నెలలో రిలీజ్ అవుతున్న ధృవకు ఎలాంటి రిజల్ట్ వస్తుందో అన్న టెన్షన్లో ఉన్నారు ఫ్యాన్స్.

Advertisement
 
Advertisement
Advertisement