ఆ రాత్రి ఏం జరిగింది? | 'Mayamal' will be released tomorrow. | Sakshi
Sakshi News home page

ఆ రాత్రి ఏం జరిగింది?

Jul 20 2017 12:52 AM | Updated on Sep 28 2018 4:15 PM

ఆ రాత్రి ఏం జరిగింది? - Sakshi

ఆ రాత్రి ఏం జరిగింది?

దిలీప్, ఈషా జంటగా తెరకెక్కిన చిత్రం ‘మాయామాల్‌’.

దిలీప్, ఈషా జంటగా తెరకెక్కిన చిత్రం ‘మాయామాల్‌’. గోవింద్‌ దర్శకత్వంలో హరికృష్ణ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. సాయికార్తీక్‌ స్వరపరచిన ఈ సినిమా పాటలను హీరో నారా రోహిత్‌ రిలీజ్‌ చేశారు. ‘‘ఒక రాత్రి మొత్తం జరిగే హారర్‌ కామెడీ చిత్రమిది. ఆ రాత్రి ఏం జరిగింది? అన్నది ఆసక్తికరం.

నా మిత్రుడు సాయికార్తీక్‌ వల్లే ఈ సినిమా చేయగలిగా. సాయికార్తీక్, జీవన్‌ కుమార్‌ల ప్రోత్సాహంతో రిలీజ్‌ వరకూ వచ్చాం’’ అన్నారు హరికృష్ణ. ‘‘సినిమా బాగా వచ్చింది’’ అన్నారు గోపాల్‌. ‘‘హైదరాబాద్‌లోని ప్రతి మాల్‌లో నైట్‌ షూట్‌ చేశాం. అవుట్‌పుట్‌  బాగా వచ్చింది’’ అన్నారు దిలీప్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement