క్రేజీ హీరోతో మారుతి..!

Maruthi Dasari Next Movie With Vijay Devarakonda - Sakshi

కామెడీ చిత్రాల స్పెషలిస్ట్‌ మారుతి ప్రస్తుతం నాగచైతన్య హీరోగా శైలజా రెడ్డి అల్లుడు సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా వినాయక చవితి కానుకగా సెప్టెంబర్‌ 13న రిలీజ్‌  అవుతోంది. రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు మారుతి శైలజా రెడ్డి అల్లుడు తరువాత చేయబోయే సినిమాను కూడా ఇప్పటికే ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది.

టాలీవుడ్ లో సెన్సేషనల్‌ స్టార్‌గా ఎదుగుతున్న విజయ్‌ దేవరకొండ హీరోగా మారుతి ఓ సినిమాను ప్లాన్‌ చేస్తున్నారట. ఇటీవల గీత గోవిందం సినిమాతో వంద కోట్ల క్లబ్‌లో చేరిన విజయ్‌ ప్రస్తుతం టాక్సీవాలా, నోటా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల తరువాత డియర్‌ కామ్రేడ్‌ సినిమా చేయాల్సి ఉంది. అంటే మారుతి దర్శకత్వంలో సినిమా ప్రారంభం కావాలంటే ఇంకాస్త టైం పట్టే అవకాశం ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top