మార్షల్‌ నచ్చితే నలుగురికి చెప్పండి | Marshal Movie Success Meet | Sakshi
Sakshi News home page

మార్షల్‌ నచ్చితే నలుగురికి చెప్పండి

Sep 16 2019 12:47 AM | Updated on Sep 16 2019 12:47 AM

Marshal Movie Success Meet - Sakshi

జయరాజ్‌ సింగ్, శ్రీకాంత్, అభయ్‌ అడక, మేఘా చౌదరి

‘‘ఖడ్గం, మహాత్మ’ తర్వాత అంత వైవిధ్యమైన పాత్ర ‘మార్షల్‌’ చిత్రంలోనిదే అని కొందరంటున్నారు. ఫోన్‌ చేసి దర్శకుడి గురించి, అభయ్‌ గురించి అడుగుతున్నారు’’ అని శ్రీకాంత్‌ అన్నారు. జయరాజ్‌ సింగ్‌ దర్శకత్వంలో అభయ్‌ అడక, మేఘా చౌదరి జంటగా, శ్రీకాంత్‌ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘మార్షల్‌’. అభయ్‌ అడక నిర్మించారు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా సక్సెస్‌మీట్‌ను ఆదివారం నిర్వహించారు. శ్రీకాంత్‌ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా సక్సెస్‌ అవడం చాలా సంతోషంగా ఉంది.

  విమర్శకులు కూడా అభినందిస్తున్నారు. సినిమా చూడండి, నచ్చితే నలుగురికి చెప్పండి’’ అన్నారు. ‘‘మా సినిమా ఫస్ట్‌ రోజు డల్‌గా స్టార్ట్‌ అయినా, మౌత్‌ టాక్‌ బాగుంది. కలెక్షన్స్‌ పికప్‌ అయ్యాయి. నిర్మాతగా సంతృప్తికరంగా ఉన్నాను’’ అన్నారు అభయ్‌. ‘‘శ్రీకాంత్‌అన్న పాత్ర, అభయ్‌ పాత్ర సినిమాకు ప్లస్‌ అయ్యాయి’’ అన్నారు జయరాజ్‌ సింగ్‌. ‘‘సినిమాకు వస్తున్న స్పందన చూస్తే చాలా ఆనందంగా ఉంది. బాగా చేశానని అభినందిస్తున్నారు’’ అన్నారు మేఘా చౌదరి.

Advertisement
 
Advertisement
Advertisement