రెండేళ్ల కష్టం | Manu Released by Nirvana Cinemas | Sakshi
Sakshi News home page

రెండేళ్ల కష్టం

Jul 7 2018 12:39 AM | Updated on Jul 7 2018 12:39 AM

Manu Released by Nirvana Cinemas - Sakshi

రాజా గౌతమ్

బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్, చాందినీ చౌదరీ జంటగా ‘మధురం’ షార్ట్‌ఫిల్మ్‌ ఫేమ్‌ ఫణీంద్ర నర్సెట్టి తెరకెక్కించిన చిత్రం ‘మను’. క్రౌడ్‌ ఫండింగ్‌ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ నిర్వాణ సినిమాస్‌ రిలీజ్‌ చేయనున్నారు. ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయడం గురించి నిర్వాణ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ – ‘‘మను’ చిత్రాన్ని రిలీజ్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది.

ఈ ప్రాజెక్ట్‌తో మేం చాలా ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యాం. ఈ సినిమాలో చాలామంది కష్టం, కన్నీళ్లు, శ్రమ ఉన్నాయి. ఈ సినిమాను పూర్తి చేయడానికి సుమారు 20 మంది రెండేళ్లు కష్టపడ్డారు. దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టితో అసోసియేట్‌ అవ్వడం చాలా హ్యాపీ. వాల్ట్‌ డిస్నీ నమ్మే సిద్ధాంతాన్నే మేమూ నమ్ముతాం. ‘మేం డబ్బులు సంపాదించడానికి సినిమాలు తీయం, సినిమాలు తీయడానికి డబ్బులు సంపాదిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: నరే‹శ్‌  కుమార్, కెమెరా: విశ్వనాథ్‌ రెడ్డి.

Advertisement
 
Advertisement
Advertisement