కల నిజమైంది | Mani Ratnam's Nawab Nears Completion | Sakshi
Sakshi News home page

కల నిజమైంది

May 14 2018 2:12 AM | Updated on May 14 2018 2:12 AM

Mani Ratnam's Nawab Nears Completion  - Sakshi

దర్శకుడు మణిరత్నం సినిమాల్లో ఏదో మ్యాజిక్‌ ఉంటుంది. ఆయన డైరెక్షన్‌ స్టైల్‌ డిఫరెంట్‌. అందుకే మణిరత్నం సినిమాల్లో నటించేందుకు యాక్టర్స్‌ ఇష్టపడుతుంటారు. కొందరైతే అదృష్టంగా భావిస్తుంటారు. ఆ అదృష్టం దక్కినందుకు ఆనందపడుతున్నారు తమిళ నటి ఐశ్వర్యా రాజేశ్‌. మణిరత్నం దర్శకత్వంలో అరవింద స్వామి, శింబు, విజయ్‌ సేతుపతి, అరుణ్‌ విజయ్, జ్యోతిక, అదితీ రావ్‌ హైదరీ, ఐశ్వర్యా రాజేశ్‌ ముఖ్య తారలుగా నటిస్తున్న చిత్రం ‘చెక్క చివంద వానమ్‌’. తెలుగులో‘నవాబ్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు.

ఈ సినిమాలో తమ వంతు షూటింగ్స్‌ను కంప్లీట్‌ చేశారు ఐశ్వర్య రాజేశ్‌ అండ్‌ అరుణ్‌ విజయ్‌. ‘‘నవాబ్‌’ సినిమాలో నా వంతు షూటింగ్‌ కంప్లీటైంది. మణిరత్నంగారితో వర్క్‌ చేయడం అమేజింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. కల నిజమైనట్లు ఉంది’’ అన్నారు ఐశ్వర్య. అంతేకాదు తమిళ హీరో శివకార్తీకేయన్‌ ప్రొడక్షన్స్‌ హౌస్‌లో రూపొందనున్న సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు ఐశ్వర్య. అరుణ్‌ రాజా దర్శకత్వంలో తెరకెక్కతోన్నఈ సినిమా ఫస్ట్‌లుక్‌ అండ్‌ టైటిల్‌ ఎనౌన్స్‌మెంట్‌ రేపు రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement