శింబు ఫిక్స్‌ | Mani Ratnam's multi-starrer to roll from January 2018 | Mani Ratnam | Sakshi
Sakshi News home page

శింబు ఫిక్స్‌

Dec 20 2017 12:27 AM | Updated on Dec 20 2017 12:27 AM

Mani Ratnam's multi-starrer to roll from January 2018 | Mani Ratnam - Sakshi

‘ముందుగా అనుకున్న అందరూ ఉన్నారు. ఆ హీరో ప్లేస్‌ ఒక్కటే డౌట్‌. మలయాళ హీరో నివిన్‌ పౌలీని అతని ప్లేస్‌లో సంప్రదించారు’... ఇది నిన్న మొన్నటి వరకు కోలీవుడ్‌లో మణిరత్నం మెగా మల్టీస్టారర్‌ సినిమా గురించి వినిపించిన వార్త. అతను శింబు అని ఊహించే ఉంటారు. శింబు, విజయ్‌ సేతుపతి, జ్యోతిక, అరవింద్‌ స్వామి, ఐశ్యర్య రాజేష్, ఫాజిల్‌ ముఖ్య పాత్రల్లో మణిరత్నం ఓ మెగా మల్టీస్టారర్‌ మూవీ ప్లాన్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే శింబు ఈ ప్రాజెక్ట్‌లో ఉంటారా? లేదా అనే సందేహం చాలామందికి ఉండేది.

దానికి కారణం అతను తమిళంలో చేసిన ‘అన్బానవన్‌ అసరాదవన్, అడంగాదవన్‌ (ఏఏఏ) సినిమా వివాదంలో చిక్కుకుంది. శింబుపై ఈ చిత్రనిర్మాత మైఖేల్‌ రాయప్పన్‌ కొన్ని ఆరోపణలు చేశారు. దీంతో ఈ హీరోగారిపై కోలీవుడ్‌లో కొంతకాలం వేటు పడుతుందన్న వార్తలు వచ్చాయి. అయితే ఈ వివాదం ఇప్పుడు సద్దుమణిగింది. దాంతో మణిరత్నం మెగా మల్టీస్టారర్‌ మూవీలో శింబునే ఫైనల్‌ అయ్యారు. అంతేకాదు మణిరత్నం స్టార్ట్‌ చేసిన యాక్టర్స్‌ వర్క్‌ షాష్‌కు కూడా శింబు హాజరవుతున్నారు. జనవరిలో షూటింగ్‌ ఆరంభం కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement