నవాబ్‌... ప్యాకప్‌ | Mani Ratnam wraps up Chekka Chivantha Vaanam | Sakshi
Sakshi News home page

నవాబ్‌... ప్యాకప్‌

Jun 3 2018 1:51 AM | Updated on Jun 3 2018 1:51 AM

Mani Ratnam wraps up Chekka Chivantha Vaanam - Sakshi

మణిరత్నం

లేటెస్ట్‌ మల్టీస్టారర్‌ మూవీ ‘చెక్క చివంద వానమ్‌’ సినిమాకు సెర్బియాలో ప్యాకప్‌ చెప్పారు దర్శకుడు మణిరత్నం. అరవింద స్వామి, శింబు, విజయ్‌ సేతుపతి, జ్యోతిక, అదితీరావ్‌ హైదరీ ముఖ్యతారలుగా మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం ‘చెక్క చివంద వానమ్‌’. లైకా ప్రొడక్షన్, మద్రాస్‌ టాకీస్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగులో ‘నవాబ్‌’గా రిలీజ్‌ చేయనున్నారు.

సెర్బియా షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్‌ పార్ట్‌ కంప్లీట్‌ అయింది. శింబు మీద కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించటానికి సెర్బియా వెళ్లింది చిత్రబృందం. శింబు పార్ట్‌ షూటింగ్‌ కంప్లీట్‌ అవ్వడంతో సినిమా మొత్తం పూర్తయింది. దాంతో ప్యాకప్‌ చెప్పారు మణిరత్నం. ఈ సినిమాలో అరవింద స్వామి, శింబు, విజయ్‌సేతుపతి అన్నదమ్ములుగా కనిపించనున్నారని సమాచారం. ఈ ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్‌ అవనున్న ఈ సినిమాకు సంగీతం: ఏఆర్‌ రెహమాన్, కెమెరా: సంతోష్‌ శివన్‌.

Advertisement
 
Advertisement
Advertisement