'బ్రెగ్జిట్'కు కారణం నేనే: విష్ణు | Manchu Vishnu on Brexit | Sakshi
Sakshi News home page

'బ్రెగ్జిట్'కు కారణం నేనే: విష్ణు

Jun 25 2016 10:49 AM | Updated on Sep 4 2017 3:23 AM

'బ్రెగ్జిట్'కు కారణం నేనే: విష్ణు

'బ్రెగ్జిట్'కు కారణం నేనే: విష్ణు

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం బ్రిటన్లో జరుగుతున్నరాజకీయ పరిణామాలే. ప్రపంచ ఆర్థిక పరిస్థితిని కూడా భారీగా దెబ్బ తీస్తున్న ఈ పరిణామంపై మంచు విష్ణు జోక్ వేశాడు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం బ్రిటన్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలే. ప్రపంచ ఆర్థిక పరిస్థితిని భారీగా దెబ్బతీస్తున్న ఈ పరిణామంపై టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఓ జోక్ వేశాడు. అసలు యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోవటానికి కారణం తానే అంటూ కామెంట్ చేశాడు విష్ణు.

'22వ తేదీన లండన్ వచ్చాను. ఇప్పుడు యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయింది. పౌండ్ విలువ భారీగా పతనం అయ్యింది. నా మిషన్ పూర్తయ్యింది. ఇప్పుడు 007 (జేమ్స్ బాండ్) ఏం చేస్తాడో చూద్దాం' అంటూ సరదాగా ట్వీట్ చేశాడు. కొద్ది రోజులుగా ఫ్యామిలీతో కలిసి హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్న విష్ణు, ఇండియాకు తిరిగి రాగానే తన తదుపరి ప్రాజెక్టులపై క్లారిటీ ఇవ్వనున్నాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement