'ఆచారి అమెరికా యాత్ర' మొదలైంది | manchu vishnu in achari america yatra | Sakshi
Sakshi News home page

'ఆచారి అమెరికా యాత్ర' మొదలైంది

Mar 18 2017 4:19 PM | Updated on Sep 5 2017 6:26 AM

'ఆచారి అమెరికా యాత్ర' మొదలైంది

'ఆచారి అమెరికా యాత్ర' మొదలైంది

దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం లాంటి సూపర్ హిట్ చిత్రాల తరువాత మంచు విష్ణు, జి.నాగేశ్వర్రెడ్డిల కాంబినేషన్లో

దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం లాంటి సూపర్ హిట్ చిత్రాల తరువాత మంచు విష్ణు, జి.నాగేశ్వర్రెడ్డిల  కాంబినేషన్లో తెరకెక్కనున్న మూడో చిత్రం ఆచారి అమెరికా యాత్ర. సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం ఆచారి పాత్రలో నటిస్తున్నారు. ఢీ, దేనికైనా రెడీ చిత్రాల్లో సూపర్బ్ కామెడీతో ఆకట్టుకున్న విష్ణు, బ్రహ్మి జోడి మరోసారి తెర మీద నవ్వులు పూయించనుంది. ఎక్కువభాగం అమెరికాలో షూటింగ్ జరుపుకోనున్న ఆచారి అమెరికా యాత్ర సినిమా శనివారం లాంచనంగా ప్రారంభమైంది.

పద్మజ పిక్చర్స్ బ్యానర్ పై ఎమ్ ఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్న ఈ సినిమాలో విష్ణు, బ్రహ్మానందంలు కృష్ణమాచారి, అప్పలాచారిగా కనిపించనున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఆచారి అమెరికా యాత్ర మంచు విష్ణు కెరీర్ లో మరో బిగ్ హిట్ గా నిలుస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.

Advertisement
 
Advertisement
Advertisement