అమ్మాయి పుట్టింది : మంచు విష్ణు | Manchu Vishnu Blessed With Baby Girl | Sakshi
Sakshi News home page

అమ్మాయి పుట్టింది : మంచు విష్ణు

Aug 9 2019 2:48 PM | Updated on Aug 9 2019 3:18 PM

Manchu Vishnu Blessed With Baby Girl - Sakshi

శ్రావణ శుక్రవారం వేళ మంచు వారింట ఆనందం వెల్లివిరిసింది. మంచు విష్ణు సతీమణి విరానికా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మంచు విష్ణు ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో సినిమా ప్రముఖులతో పాటు అభిమానుల నుంచి విష్ణుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘వరలక్ష్మీ వ్రతం నాడు ఆడపిల్ల పుట్టింది కాబట్టి ఆ లక్ష్మీదేవి మీ ఇంట అడుగుపెట్టినట్టే. ఇకపై మీకు అన్నీ శుభాలే’ అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా విష్ణు దంపతులకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు వివియానా, అరియానా, అవ్రామ్‌లు ఉన్న విషయం తెలిసిందే. వీరిలో అరియానా, వివియానా కవలలు. ఇక కెరీర్‌ పరంగా మంచు విష్ణు ఇటీవల ఓటర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement