మిస్టర్ కూల్..! | Manchu Manoj 'Shourya' First Look revealed | Sakshi
Sakshi News home page

మిస్టర్ కూల్..!

Nov 20 2015 11:15 PM | Updated on Aug 17 2018 2:24 PM

మిస్టర్ కూల్..! - Sakshi

మిస్టర్ కూల్..!

మంచు మనోజ్ సినిమాలంటే యాక్షన్ అండ్ ఎంటర్‌టైన్ మెంట్‌కు ఢోకా ఉండదు. ‘దొంగ దొంగది’

మంచు మనోజ్ సినిమాలంటే యాక్షన్ అండ్ ఎంటర్‌టైన్ మెంట్‌కు ఢోకా ఉండదు. ‘దొంగ దొంగది’ నుంచి ‘కరెంట్ తీగ’ వరకూ ఇంచు మించు అన్ని చిత్రాల్లోనూ  ఫుల్ మాస్ లుక్‌లో రఫ్ అండ్ టఫ్‌గా కనిపించారు మనోజ్. అలాంటి మనోజ్ ఇప్పుడు ‘శౌర్య’గా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు.  ‘సంతోషం’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’  చిత్రాలతో సున్నితమైన కథాంశాలను టచ్ చేస్తూ  క్లాస్ డెరైక్టర్‌గా పేరు తెచ్చుకున్న దశరథ్ దర్శకత్వంలో కూల్‌గా సాఫ్ట్‌లుక్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారాయన. సురక్ష్ ఎంటర్‌టైన్ మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్  ‘శౌర్య’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెజీనా కథానాయిక. మనోజ్ మాట్లాడుతూ-‘‘ ఈ  సినిమా చిత్రీకరణ ఇప్పటికే 75 శాతం పూర్తయింది. జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. దశరథ్ లాంటి క్లాస్ డెరైక్టర్‌తో నేను చేస్తున్న లవ్ థ్రిల్లర్ ఇది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: వేదా కె.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement