వెరైటీగా మంచు మనోజ్ వెడ్డింగ్ కార్డ్ | Manchu Manoj, Pranitha Reddy wedding card | Sakshi
Sakshi News home page

వెరైటీగా మంచు మనోజ్ వెడ్డింగ్ కార్డ్

Apr 29 2015 2:59 PM | Updated on Sep 3 2017 1:07 AM

వెరైటీగా మంచు మనోజ్ వెడ్డింగ్ కార్డ్

వెరైటీగా మంచు మనోజ్ వెడ్డింగ్ కార్డ్

మనోజ్- ప్రణతిరెడ్డి వెడ్డింగ్ కార్డు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

హైదరాబాద్: మంచు వారింట మరి కొద్ది రోజుల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు తనయుడు మనోజ్ వివాహం మే 20న జరగనుంది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు ఫ్యామిలీ పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే శుభలేఖలు పంచిపెట్టడం మొదలు పెట్టారు.

ఇక ప్రత్యేకంగా తయారు చేసిన వెడ్డింగ్ కార్డు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాషాయ, ఊదారంగు కాంబినేషన్ లో కళంకారి తరహా బొమ్మలతో రూపొందించిన శుభలేఖ ఆకర్షణీయంగా ఉంది. వివాహ మహోత్సవం గొప్పతనాన్ని తెలిపేలా కార్డు డిజైన్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ కార్డు చూసి మెచ్చుకున్నారు. తనకు ఇలాంటి కార్డు కావాలని ఆయన స్వయంగా అడిగారని మనోజ్ చెప్పారు.

మనోజ్- ప్రణతిరెడ్డి వివాహం  మే 20న ఉదయం 9.10 గంటలకు హైటెక్స్ లో జరగనుంది.  ఈ వివాహానికి సినిమా, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఆహ్వానించారు. మంచు మనోజ్- ప్రణతిరెడ్డిల నిశ్చితార్థ వేడుక మార్చి 4న జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement