వైభవంగా మనోజ్-ప్రణతి వివాహం | Manchu Manoj, Pranathi Reddy's wedding in hightech city | Sakshi
Sakshi News home page

వైభవంగా మనోజ్-ప్రణతి వివాహం

May 20 2015 9:18 AM | Updated on Oct 16 2018 2:49 PM

వైభవంగా మనోజ్-ప్రణతి వివాహం - Sakshi

వైభవంగా మనోజ్-ప్రణతి వివాహం

మంచువారి అబ్బాయి ఓ ఇంటివాడయ్యాడు. ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

హైదరాబాద్ :  మంచువారి అబ్బాయి ఓ ఇంటివాడయ్యాడు. ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మాదాపూర్ హైటెక్స్లో  బుధవారం ఉదయం 9 గంటల 10 నిమిషాలకు మనోజ్-ప్రణతిల వివాహం సంప్రదాయబద్ధంగా జరిగింది. సరిగ్గా సుముహూర్తం సమయానికి ప్రణతి మెడలో మంచు మనోజ్ తాళి కట్టాడు. సోదరి లక్ష్మీప్రసన్న దగ్గరుండి ఈ తంతును పూర్తిచేయించారు.

 

ఈ వివాహానికి దక్షిణాది చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ ప్రముఖులు, వాణిజ్యవేత్తలు హాజరై నూతన వధువరూలను ఆశీర్వదించారు.  తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు హాజరయ్యారు. మరోవైపు మంచువారి పెళ్లికి భారీ భద్రత ఏర్పాటు చేశారు. అంతకు ముందు మనోజ్తో పురోహితులు పూజ చేయించారు.







Advertisement
 
Advertisement
Advertisement