కాక పుట్టిస్టున్న రజనీ ఫస్ట్‌ లుక్‌..! | Man Vs Wild Show Rajinikanth First Look Released | Sakshi
Sakshi News home page

కాక పుట్టిస్టున్న రజనీ ఫస్ట్‌ లుక్‌..!

Feb 19 2020 9:04 PM | Updated on Feb 19 2020 9:23 PM

Man Vs Wild Show Rajinikanth First Look Released - Sakshi

అడ్వంచర్‌ థీమ్‌తో బ్యాగ్రౌండ్‌లో అగ్ని కీలలు, నిప్పు కణికలతో ఉన్న ఇద్దరి క్లోజప్‌ సరికొత్త అనుభూతి కలిగిస్తోంది.

43 ఏళ్ల సినీ ప్రయాణంలో సూపర్‌స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్‌ బుల్లితెరపై తొలిసారి దర్శనమిస్తున్నాడు. 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' షోలో భాగంగా బేర్‌ గ్రిల్స్‌తో కలిసి నెల క్రితం అడవిబాట పట్టిన రజనీ రెండు రోజులపాటు వన్య మృగాల ఆవాసంలో గడిపాడు. డిస్కవరీ చానెల్‌లో ఈ షో త్వరలో ప్రసారం కానున్న నేపథ్యంలో.. రజనీ, బేర్‌ గ్రిల్స్‌ ఫస్ట్‌ లుక్‌ బయటికొచ్చింది. అడవిలోని ఓ దారి పక్కన టాప్‌లెస్‌ జీప్‌ను ఆనుకుని ఉన్న రజనీ, గ్రిల్స్‌ లుక్‌ అదిరిపోయింది. అడ్వంచర్‌ థీమ్‌తో బ్యాగ్రౌండ్‌లో అగ్ని కీలలు, నిప్పు కణికలతో ఉన్న ఇద్దరి క్లోజప్‌ సరికొత్త అనుభూతి కలిగిస్తోంది. 15 సెకండ్ల నిడివి గల ఈ మోషన్‌ పోస్టర్‌ను గ్రిల్స్‌ ట్విటర్‌లో షేర్‌ చేశాడు.
(చదవండి : నేను బాగానే ఉన్నాను: రజనీకాంత్‌)

వన్య ప్రపంచం నేపథ్యంలో ఎంతో మందితో కలిసి పనిచేశానని, అయితే, రజనీకాంత్‌తో పనిచేయడం ప్రత్యేకమని అన్నాడు. త్వరలోనే డిస్కవరి చానెల్‌లో మీ ముందుంటామని తెలిపాడు. లవ్‌ ఇండియా. #తలైవా అంటూ గ్రిల్స్‌ ట్వీట్‌ చేశాడు. ఈ డాక్యుమెంటరీ షూటింగ్ కర్ణాటకలోని బందీపూర్‌ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌ జరిగింది. షూటింగ్‌ చేస్తున్న క్రమంలో రజనీకి స్వల్ప గాయాలైన సంగతి తెలిసిందే. ఇక ఈ షోని  మొత్తం నడిపించే బేర్ గ్రిల్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పర్యావరణ సంరక్షణ అనే కాన్సెప్ట్‌తో ఈ షోని నడిపిస్తుంటారు. ఇటీవల ప్రధాని మోదీ కూడా బేర్‌ గ్రిల్స్‌తో కలిసి ఈ షోలో పాల్గొన్నాడు.
(చదవండి : బ్యాక్‌ టు చెన్నై)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement