ఆస్కార్‌ను కొట్టేసి మరీ దర్జాగా... | Man Arrested for Theft Oscar Trophy | Sakshi
Sakshi News home page

Mar 6 2018 2:21 PM | Updated on Mar 6 2018 2:58 PM

Man Arrested for Theft Oscar Trophy - Sakshi

లాస్‌ ఏంజిల్స్‌ : ఆస్కార్‌ వేడుకల్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. అవార్డుల వేడుకలకు హాజరైన ఓ ప్రేక్షకుడు ఏకంగా అవార్డు షీల్డ్‌ను ఎత్తికెళ్లాడు. అంతటితో ఆగకుండా దర్జాగా మీడియాకు ఫోజులిస్తూ హల్‌ చల్‌ చేశాడు.

అవార్డు వేడుకల అనంతరం గవర్నర్స్‌ బాల్స్‌ కార్యక్రమానికి నటీనటులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ నటిగా ఎంపికైన ఫ్రాన్సెస్‌ మెక్‌డార్మమండ్‌ (త్రి బిల్‌బోర్డ్స్‌ ఔట్‌సైడ్‌ ఎబింగ్‌, మిసోరి) తన షీల్డ్‌ను పక్కనపెట్టారు. అంతలో గుట్టుచప్పుడు కాకుండా ఓ వ్యక్తి దానిని దొంగిలించాడు. ఆపై పార్టీలో ఆ షీల్డ్‌ తో సందడి చేశాడు. అటుపై బయటకు వెళ్తున్న క్రమంలో మీడియా కెమెరాలకు అతను ఫోజులివ్వటం విశేషం. 

అవార్డు కనబడకపోవటంతో కంగారు పడిన మెక్‌డార్మమండ్‌.. విషయాన్ని నిర్వాహకులకు  తెలియజేశారు. వారు పోలీసులకు సమాచారం అందించటంతో సీసీఫుటేజీ దృశ్యాల ఆధారంగా అతన్ని పట్టేసుకున్నారు. నిందితుడిని కాలిఫోర్నియాకు చెందిన టెర్రీ బ్రాయంట్‌గా గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement