'పిచ్చిపిచ్చిగా పీకల్లోతు ప్రేమలో పడ్డానోయ్' | Mallika Sherawat declares she’s in love, introduces her French boyfriend | Sakshi
Sakshi News home page

'పిచ్చిపిచ్చిగా పీకల్లోతు ప్రేమలో పడ్డానోయ్'

Mar 17 2016 3:02 PM | Updated on Apr 3 2019 6:23 PM

'పిచ్చిపిచ్చిగా పీకల్లోతు ప్రేమలో పడ్డానోయ్' - Sakshi

'పిచ్చిపిచ్చిగా పీకల్లోతు ప్రేమలో పడ్డానోయ్'

బాలీవుడ్ శృంగార తార మల్లికా షెరావత్ ఆనంద డోలికల్లో తేలిపోతోంది. మిగితా బాలీవుడ్ భామల్లా కాకుండా ఏమాత్రం జంకూబొంకూ లేకుండా 'నేను ప్రేమలో పడ్డానండోయ్' అంటూ ఢంకా బజయించి చెబుతోంది.

ముంబయి: బాలీవుడ్ శృంగార తార మల్లికా షెరావత్ ఆనంద డోలికల్లో తేలిపోతోంది. మిగితా బాలీవుడ్ భామల్లా కాకుండా ఏమాత్రం జంకూబొంకూ లేకుండా 'నేను ప్రేమలో పడ్డానండోయ్' అంటూ ఢంకా బజయించి చెబుతోంది. అంతేకాదు ప్రేమ గురించి తన వ్యక్తి గత అభిప్రాయం చెబుతూ 'ప్రేమలో ఉండటమనేది ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఫీలింగ్' అంటూ కూడా చెప్పేసింది. అంతేకాకుండా తనకేం భయం కాదంటూ ఏకంగా తన బాయ్ ఫ్రెండ్ ఫొటోను కూడా ట్విట్టర్ లో పంచుకొంది.

ఆమెకు గత కొద్ది రోజుల కిందట ప్యారీస్ కు చెందిన 'సిరిల్లే ఆక్సెన్ ఫ్యాన్స్' అనే వ్యాపారవేత్త పరిచయమయ్యాడని, అతడితో మంచి చనువు ఏర్పడి డేటింగ్ కూడా చేస్తున్నట్లు అతడే తన బాయ్ ఫ్రెండ్ గా కూడా ఖరారుచేసినట్లు అధికారికంగా ప్రకటించింది ఈ అమ్మడు. అంతేకాదు.. అతడు ఇంతవరకు మల్లికా లాంటి అమ్మాయిని చూడలేదని, ఆమె తనకు రాణి అని తెగ పొగిడేస్తున్నాడు.

ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఫొటోలో నల్లటి కళ్లద్దాలతో ఉండి మల్లికా రెడ్ డ్రెస్ లో ఆమె బాయ్ ఫ్రెండ్ యాష్ కలర్ కోట్ వేసుకొని ఓ బిజినెస్ ఫ్లైట్ ఎంట్రెన్స్ వద్ద అదిరిపోయే స్టైల్ లో పోజిచ్చారు. ఈ ఫ్రెంచ్ వ్యక్తితో పీకల్లోతూ ప్రేమలో పిచ్చిపిచ్చిగా పడిపోయాను బాబోయ్ అంటూ సంబరపడిపోతోంది మల్లికా. ఇప్పటికే పలువురితో డేటింగ్ చేసిన మల్లికా ఈ ప్రేమను అయినా నిలుపుకుంటుందో ఒలకబోసుకుంటుందో ఎదురుచూడాలి మరి.

Advertisement
 
Advertisement
Advertisement