మళ్ళీ కొత్త ఫోన్‌ కొనాలి – సుమంత్‌ | Malli Raava Movie Success Meet | Sakshi
Sakshi News home page

మళ్ళీ కొత్త ఫోన్‌ కొనాలి – సుమంత్‌

Dec 16 2017 12:03 AM | Updated on Dec 16 2017 12:03 AM

Malli Raava Movie Success Meet  - Sakshi

రాహుల్, సుమంత్, ‘మధుర’ శ్రీధర్, గౌతమ్‌ తిన్ననూరి

సుమంత్, ఆకాంక్ష సింగ్‌ జంటగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రాహుల్‌ నక్కా నిర్మించిన చిత్రం ‘మళ్ళీ రావా’. ఈ చిత్రం సక్సెస్‌ మీట్‌ హైదరాబాద్‌లో జరిగింది. సుమంత్‌ మాట్లాడుతూ– ‘‘ సక్సెస్, ఫెయిల్యూర్‌ రెండిటిని సమానంగా తీసుకుంటాను. ‘మళ్ళీ రావా’  చాలా సంతృప్తిని ఇచ్చింది. ఈ చిత్రం ద్వారా గౌతమ్‌ను దర్శకునిగా పరిచయం చేసినందుకు గర్వంగా ఉంది. ఇండస్ట్రీ నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ఫోన్‌ పాడైపోయింది, కొత్త ఫోన్‌ కొనాలి.

సినిమాలో మ్యూజిక్‌ హైలైట్‌ అయింది. సినిమాని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు’’ అని అన్నారు. ‘‘సినిమాను ఎంత నమ్మామో అంత కంటే మంచి ఫలితం లభించింది. అందరూ తమ సొంత సినిమాలా పని చేశారు. ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు నిర్మాత. ‘‘నన్ను నమ్మిన సుమంత్‌ గారికి, నిర్మాతకు కృతజ్ఞతలు. ఇండస్త్రీ నుంచి ‘మంచి సినిమా చేశారు’ అంటూ అభినందనలు వస్తున్నాయి. ఇది టీమ్‌ సక్సెస్‌’’ అన్నారు గౌతమ్‌. చిత్రబృందానికి ‘మధుర’ శ్రీధర్‌ అభినందనలు తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement