మలయాళ మల్లెతీగ | Malle Teega movie audio launched | Sakshi
Sakshi News home page

మలయాళ మల్లెతీగ

Dec 16 2013 2:22 AM | Updated on Apr 3 2019 4:08 PM

మలయాళ మల్లెతీగ - Sakshi

మలయాళ మల్లెతీగ

జాతీయ ఉత్తమ దర్శకుడు బ్లెస్సీ దర్శకత్వంలో శ్వేతామీనన్ నటించిన మలయాళ చిత్రం ‘కలిమన్ను’ తెలుగులో ‘మల్లెతీగ’గా అనువాదమవుతోంది.

జాతీయ ఉత్తమ దర్శకుడు బ్లెస్సీ దర్శకత్వంలో శ్వేతామీనన్ నటించిన మలయాళ చిత్రం ‘కలిమన్ను’ తెలుగులో ‘మల్లెతీగ’గా అనువాదమవుతోంది. బొడ్డు దేవికిరణ్ అనువదిస్తున్న ఈ చిత్రం పాటల్ని పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న దర్శక నిర్మాత సునీల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ -‘‘లైవ్ ప్రెగ్నెన్సీ అనేది ఇప్పటి వరకూ ఎవరూ చేయని సాహసం. ఇందులో శ్వేతామీనన్‌తో చేయించారు’’ అని చెప్పారు. మాతృత్వపు మాధుర్యాన్ని తెలిపే చిత్రమిదని దేవికిరణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా శివకృష్ణ, బొడ్డు చంద్రశేఖర్‌రావు, చిన్నా, సుబ్బు, శివగణేష్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement