ఇద్దరూ ఏం చేశారు?
మోహన్‌లాల్, అమలా పాల్ జంటగా నటించిన మలయాళ సినిమా ‘లైలా ఓ లైలా’ తెలుగులో ‘ఇద్దరూ ఇద్దరే’ పేరుతో విడుదల కానుంది.
మోహన్‌లాల్, అమలా పాల్ జంటగా నటించిన మలయాళ సినిమా ‘లైలా ఓ లైలా’ తెలుగులో ‘ఇద్దరూ ఇద్దరే’ పేరుతో విడుదల కానుంది. జోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాని కేఆర్ ఫిల్మ్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మాత కందల కృష్ణారెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సత్యరాజ్, రమ్యా నంబీశన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు.
నిర్మాత కృష్ణారెడ్డి మాట్లాడుతూ -‘‘మోహన్‌లాల్, సత్యరాజ్ స్పెషల్ ఏజెంట్స్‌గా నటించారు. ఇండియాలో టైస్టులకు వీరిద్దరూ ఎలా చెక్ పెట్టారు? ఏం చేశారు? అనేది కథ. సినిమాలో మోహన్‌లాల్, అమలా పాల్ ప్రేమకథ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. త్వరలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు-పాటలు: వై.రామకృష్ణ, సంగీతం: గోపీసుందర్.