పవన్కు జోడిగా మజ్ను హీరోయిన్ | Majnu Fame Anu Emmanuel to play as Pawan Kalyans heroine | Sakshi
Sakshi News home page

పవన్కు జోడిగా మజ్ను హీరోయిన్

Dec 2 2016 1:27 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్కు జోడిగా మజ్ను హీరోయిన్ - Sakshi

పవన్కు జోడిగా మజ్ను హీరోయిన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పుల్ ఫాంలో ఉన్నాడు. 2019 ఎన్నికల్లో పోటి చేసే ఆలోచనలో ఉన్న పవన్, ఈ లోగా వీలైనన్ని ఎక్కువ సినిమాలను పూర్తి చేయాలని

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పుల్ ఫాంలో ఉన్నాడు. 2019 ఎన్నికల్లో పోటి చేసే ఆలోచనలో ఉన్న పవన్, ఈ లోగా వీలైనన్ని ఎక్కువ సినిమాలను పూర్తి చేయాలని భావిస్తున్నాడు. అందుకోసం ఇప్పటికే మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు సినిమాలో నటిస్తున్న పవన్, తరువాత చేయబోయే రెండు సినిమాలను ప్రకటించాడు.

ఏఎం రత్నం నిర్మాణంలో తమిళ దర్శకుడు నేసన్ తెరకెక్కించబోయే సినిమాతో పాటు, హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలను ఇప్పటికే లాంఛనంగా ప్రారంభించాడు. ముందుగా సెట్స్ మీదకు వెళ్లనున్న త్రివిక్రమ్ సినిమాకు నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉన్న.., ఈ సినిమాలో కీర్తి సురేష్ ఒక హీరోయిన్గా నటిస్తుండగా.. తాజాగా మరో హీరోయిన్ పాత్రకు మజ్ను ఫేం అను ఇమ్మన్యూల్ను ఎంపిక చేశారు. నాని హీరోగా తెరకెక్కిన మజ్ను సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అను, వెంటనే పవన్ లాంటి టాప్ స్టార్ సరసన నటించే అవకాశం దక్కటంతో తెగ సంబర పడిపోతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement