మైనే ప్యార్‌కియాకు సంబంధం లేదు | Maine Pyar Kiya to Not associated | Sakshi
Sakshi News home page

మైనే ప్యార్‌కియాకు సంబంధం లేదు

Mar 16 2014 11:58 PM | Updated on Sep 2 2017 4:47 AM

మైనే ప్యార్‌కియాకు సంబంధం లేదు

మైనే ప్యార్‌కియాకు సంబంధం లేదు

ప్రదీప్, ఇషా తల్వార్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘మైనే ప్యార్‌కియా’. ప్రదీప్ మాడుగల దర్శకుడు. సానా వెంకటరావు, ఉపేంద్రకుమార్ నిర్మాతలు.

ప్రదీప్, ఇషా తల్వార్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘మైనే ప్యార్‌కియా’. ప్రదీప్ మాడుగల దర్శకుడు. సానా వెంకటరావు, ఉపేంద్రకుమార్ నిర్మాతలు. అమెరికాలో జరిగిన తెలుగు సంఘం(తానా) ఈవెంట్స్‌లో ఈ చిత్రం ప్రచార చిత్రాలను విడుదల చేశారు. మిస్ అమెరికా నీనా దావులూరి ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చేశారు. ‘‘పూర్తి స్థాయి వినోదంతో సాగే సరికొత్త ప్రేమకథ ఇది. హిందీ ‘మైనే ప్యార్‌కియా’కి, ఈ సినిమాకు ఏ సంబంధం ఉండదు. ఇండియా, బ్యాంకాక్‌లో చిత్రీకరణ జరుపుతున్నాం. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసి ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు తెలిపారు. పోసాని కృష్ణమురళి, కోమల్ ఝా, ఉత్తేజ్, మధుమిత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రదీప్‌కుమార్ వి., కెమెరా: ఎస్వీ విశ్వ.
 

Advertisement
 
Advertisement
Advertisement