మహేష్ మూవీ టైటిల్ ఎప్పుడంటే..! | Mahesh New Film title to be announced on dasara | Sakshi
Sakshi News home page

మహేష్ మూవీ టైటిల్ ఎప్పుడంటే..!

Aug 16 2016 2:59 PM | Updated on Jul 29 2019 6:03 PM

మహేష్ మూవీ టైటిల్ ఎప్పుడంటే..! - Sakshi

మహేష్ మూవీ టైటిల్ ఎప్పుడంటే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. ఇటీవల మొదలైన ఈ సినిమా ప్రస్తుతం హైదరబాద్ పరిసర ప్రాంతంలో షూటింగ్...

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. ఇటీవల మొదలైన ఈ సినిమా ప్రస్తుతం హైదరబాద్ పరిసర ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది. మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేస్తారన్న టాక్ వినిపించినా.. ఇప్పట్లో అలాంటిదేమి లేదంటూ చిత్రయూనిట్ ప్రకటించారు. అయితే తాజాగా మరో ఆసక్తికరమైన వార్త సూపర్ స్టార్ అభిమానులకు కిక్ ఇస్తోంది.

న్యాయ వ్యవస్థ లోని లోపాలపై తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ను దసర సందర్భంగా ప్రకటించనున్నారట. ఇప్పటికే ఈ సినిమాకు ఎనిమీ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే దసర రోజున చిత్రయూనిట్ అధికారికంగా సినిమా టైటిల్ను ప్రకటించనున్నారు. ఇక మహేష్ లుక్ను మాత్రం సంగం షూటింగ్ పూర్తయిన తరువాత జనవరి రెండో వారంలో రివీల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement