మహేశ్ వద్దన్నాడు... సూర్య చేస్తున్నాడు! | Mahesh Babu's loss is Suriya's gain | Sakshi
Sakshi News home page

మహేశ్ వద్దన్నాడు... సూర్య చేస్తున్నాడు!

Nov 25 2015 2:49 PM | Updated on Sep 3 2017 1:01 PM

మహేశ్ వద్దన్నాడు... సూర్య చేస్తున్నాడు!

మహేశ్ వద్దన్నాడు... సూర్య చేస్తున్నాడు!

ప్రిన్స్ మహేశ్ బాబు వదులుకున్న సినిమాను తమిళ హీరో సూర్య చేస్తున్నాడు.

చెన్నై: ప్రిన్స్ మహేశ్ బాబు వదులుకున్న సినిమాను తమిళ హీరో సూర్య చేస్తున్నాడు. 'మనం' ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న '24' సినిమాలో సూర్య నటిస్తున్నాడు. ముందుగా ఈ కథను మహేశ్ కు విక్రమ్ కుమార్ వినిపించాడట. అతడికి ఫస్టాప్ బాగా నచ్చిందట. సెకండాఫ్ అంతగా ఆకట్టుకోలేకపోవడంతో ఈ సినిమా చేసేందుకు మహేశ్ ఆసక్తి చూపలేదట. తర్వాత ఈ సబ్జెక్ట్ సూర్యకు వద్దకు వెళ్లడం, అతడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.

సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న ఈ సినిమాలో మూడు పాత్రల్లో సూర్య కనిపించనున్నాడని సమాచారం. అన్నదమ్ములుగా, అన్న కొడుకుగా కనిపిస్తాడని తెలుస్తోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్తో పాటు 2డి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సూర్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. 2016లో వేసవిలో '24' సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. మంగళవారం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆసక్తికరంగా ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement