టీనేజ్‌లోకి వచ్చావ్‌.. ఎంజాయ్‌ చెయ్‌

Mahesh Babu Tweet About His Son Goutham - Sakshi

సూపర్‌స్టార్‌ కృష్ణ వెండితెరను ఏలుతున్న తరుణంలో.. మహేష్‌ బాబు బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక మహేష్‌ బాబు రాజకుమారుడు సినిమాతో హీరోగా మారి టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం టాప్‌ హీరోల్లో ఒకడిగా ఉంటూ.. బ్లాక్‌ బస్టర్‌ హిట్‌లతో దూసుకుపోతున్నాడు. అలాగే మహేష్‌ తన కుమారుడు గౌతమ్‌ను కూడా బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేయించారు. నేటితో గౌతమ్‌ టీనేజ్‌లోకి వచ్చాడని సోషల్‌ మీడియా వేదికగా తెలిపాడు.

సోషల్‌ మీడియాలో​ మహేష్‌ బాబుకు ఎంత ఫాలోయింగ్‌ ఉంటుందో.. గౌతమ్‌, సితారలకు కూడా అంతే ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంటుంది. సుకుమార్‌ దర్శకత్వంలో మహేష్‌ చేసిన వన్‌ నెనొక్కడినే చిత్రంలో గౌతమ్‌ నటించిన సంగతి తెలిసిందే. ‘పదమూడో పుట్టినరోజు జరుపుకుంటున్న గౌతమ్‌కు శుభాకాంక్షలు. నువ్వు అధికారికంగా ఓ యుక్తవయస్కుడివి అయ్యావు. నీ ఈ కౌమార దశను సరదాగా, అడ్వెంచర్స్‌తో సెలబ్రేట్‌ చేసుకోవాలి’ అంటూ మహేష్‌ బాబు ట్వీట్‌ చేశాడు. మహేష్‌ ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిజీగా ఉన్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top