కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తోన్న మహేష్..? | Mahesh babu stepping into Theater business | Sakshi
Sakshi News home page

కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తోన్న మహేష్..?

Apr 11 2017 2:08 PM | Updated on Sep 5 2017 8:32 AM

కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తోన్న మహేష్..?

కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తోన్న మహేష్..?

టాలీవుడ్లో సూపర్ స్టార్గా తిరుగలేని ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో మహేష్ బాబు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎక్కువగా నటన

టాలీవుడ్లో సూపర్ స్టార్గా తిరుగలేని ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో మహేష్ బాబు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎక్కువగా నటన మీదే దృష్టి పెట్టిన సూపర్ స్టార్, బిజినెస్ల జోలికి పెద్దగా వెళ్లలేదు. కానీ ఇటీవల శ్రీమంతుడు సినిమాతో తొలిసారిగా నిర్మాణం రంగంలోకి అడుగుపెట్టి ఘనవిజయం సాధించాడు. అదే బాటలో ఇప్పుడు మరో భారీ బిజినెస్ను ప్లాన్ చేస్తున్నాడు మహేష్.

ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా థియేటర్ల బిజినెస్లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నాడట. ఇప్పటికే ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఏసియన్ సినిమా అధినేత సునీల్ నారంగ్తో చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం. తొలి ప్రయత్నంగా తెలుగు రాష్ట్రాల్లో 25 మల్టీప్లెక్స్లను నిర్మించాలని భావిస్తున్నాడు. ప్రొడక్షన్ తరహాలోనే థియేటర్ బిజినెస్లోనూ సూపర్ స్టార్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.

Advertisement
 
Advertisement
Advertisement