సరిలేరు నీకెవ్వరు! | mahesh babu next movie anil ravi pudi | Sakshi
Sakshi News home page

సరిలేరు నీకెవ్వరు!

Apr 28 2019 3:30 AM | Updated on Apr 28 2019 5:15 AM

mahesh babu next movie anil ravi pudi - Sakshi

మహేశ్‌బాబు

‘మహర్షి’ సినిమా షూటింగ్‌ను కంప్లీట్‌ చేసి ప్రజెంట్‌ ఫారిన్‌లో ఫ్యామిలీతో కలిసి హాలిడేని ఎంజాయ్‌ చేస్తున్నారు మహేశ్‌బాబు. అయితే మహేశ్‌ నెక్ట్స్‌ సినిమా వర్క్స్‌ మాత్రం మంచి జోరుగా సాగుతున్నాయి. ‘ఎఫ్‌ 2’ ఫేమ్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ నిర్మించనుంది. ఈ సినిమా షూటింగ్‌ కోసం కర్నూల్‌లో లొకేషన్స్‌ని వెతుకుతున్నారు అనిల్‌ రావిపూడి.

ఈ చిత్రం ఫస్ట్‌ షెడ్యూల్‌ జూన్‌లో స్టార్ట్‌ కానుందని తెలుస్తోంది. అలాగే లేడీ సూపర్‌ స్టార్‌ విజయశాంతి ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయడానికి అంగీకరించారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఈ చిత్రంలో రష్మికా మండన్నా కథానాయిక అని తెలిసింది. అలాగే ఈ సినిమాకు ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్‌ను టీమ్‌ పరిశీలిస్తోందని సోషల్‌ మీడియాలో ప్రచారం సాగుతోంది. మహేశ్‌ కెరీర్‌లో వన్నాఫ్‌ ది హిట్స్‌గా నిలిచిన ‘ఒక్కడు’ సినిమాలోని కొన్ని సీన్లు కర్నూల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటాయని గుర్తుండే ఉంటుంది. ఇదిలా ఉంటే.. ‘మహర్షి’ ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ మే 1న జరగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement