బోయపాటితో మహేష్‌ మూవీనా..? | Mahesh Babu may Act In Boyapati Srinu Direction | Sakshi
Sakshi News home page

Jan 12 2019 9:14 AM | Updated on Jan 12 2019 9:17 AM

Mahesh Babu may Act In Boyapati Srinu Direction - Sakshi

వినయ విధేయ రామతో విధ్వంసం సృష్టించిన బోయపాటి శ్రీను.. సూపర్‌స్టార్‌ మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ‘వీవీఆర్‌’లో రామ్‌ చరణ్‌తో నానా ఫీట్లు చేయించిన బోయపాటి మహేష్‌ను కూడా త్వరలోనే డైరెక్ట్‌ చేయనున్నట్లు సమాచారం. 

అయితే మహేష్‌ ప్రస్తుతం మహర్షి షూటింగ్‌లో బిజీగా ఉండగా.. అటుపై సుకుమార్‌ డైరెక్షన్‌లో ఓ మూవీని చేయనున్నాడు. ఇటు బోయపాటి బాలయ్యతో ఓ సినిమాను కమిట్‌ అయి ఉన్నాడు. అసలే వీవీఆర్‌ ఎఫెక్ట్‌తో ఉన్న బోయపాటికి మహేష్‌ చాన్స్‌ ఇస్తాడా? ఇంత బిజీ షెడ్యుల్‌లో వీరి చిత్రం రావడానికి అవకాశాలు ఉన్నాయా? కానీ బోయపాటి మహేష్‌తో సినిమా చేయబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.  

Advertisement
 
Advertisement
Advertisement