స్టైలిష్‌ లుక్‌లో మహేష్‌!

Mahesh Babu Maharshi Second Look out - Sakshi

‘భరత్‌ అనే నేను’ లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తరువాత మహేష్‌ బాబు నటిస్తున్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్‌ ఎన్నడూ లేని బియర్డ్‌ లుక్‌లో మహర్షి చిత్రంలో కనిపించేసరికి సూపర్‌స్టార్‌ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ మూవీ నుంచి మరో లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 

సూట్‌లో అలా స్టైలిష్‌గా మహేష్‌ నడుస్తూ ఉండగా.. పక్కన ఉన్నవారు గొడుగు పట్టుకుని ఉన్న ఈ లుక్‌ ప్రిన్స్‌ అభిమానులకు మంచి కిక్కిచ్చేలా ఉంది. స్టూడెంట్‌గా కాలేజ్‌లో నడుస్తు వచ్చిన టీజర్‌లో మహేష్‌ గడ్డంతో ఉండగా, ఈ లుక్‌లో పవర్‌ఫుల్‌ బిజినెస్‌మెన్‌లా కనిపిస్తున్నాడు. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, అల్లరి నరేష్‌ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top