100 రోజుల 'శ్రీమంతుడు' | Mahesh babu, koratala siva, sruthi Hassan Srimathudu completed 100days | Sakshi
Sakshi News home page

100 రోజుల 'శ్రీమంతుడు'

Nov 14 2015 10:41 AM | Updated on Sep 3 2017 12:29 PM

100 రోజుల 'శ్రీమంతుడు'

100 రోజుల 'శ్రీమంతుడు'

మహేష్ బాబు కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ గా నిలిచిన శ్రీమంతుడు సినిమా వందరోజులు పూర్తి చేసుకుంది. ఆగస్టు 7న, మహేష్ పుట్టిన రోజుకు రెండు రోజులు ముందుగా, ప్రేక్షకుల ముందుకు వచ్చిన...

మహేష్ బాబు కెరీర్ లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచిన శ్రీమంతుడు సినిమా వంద రోజులు పూర్తి చేసుకుంది. ఆగస్టు 7న, మహేష్ పుట్టిన రోజుకు రెండురోజులు ముందుగా, ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, భారీ వసూళ్లతో రికార్డ్ కలెక్షన్లు సాధించింది. ప్రస్తుత పరిస్థితుల్లో సూపర్ హిట్ సినిమా కూడా 50 రోజులు ఆడటం కష్టంగా కనిపిస్తుంటే, శ్రీమంతుడు మాత్రం వంద రోజులు పూర్తి చేసుకొని చరిత్ర సృష్టించింది. దాదాపు 15 థియేటర్లలో ఈ సినిమా వందరోజులు పూర్తి చేసుకొని మహేష్ బాబు కెరీర్‌లో మరో భారీ విజయంగా నిలిచింది.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సందేశాత్మక కుటుంబ కథా చిత్రంలో, శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. సంపన్న వర్గాల వారు గ్రామాలను దత్తత తీసుకోవటం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఎంతో మంది సెలబ్రిటీలకు ఇన్పిపిరేషన్ గా నిలిచింది. ఈ సినిమా తరువాత మహేష్ బాబు తో పాటు ప్రకాష్ రాజ్, సుమన్, శృతిహాసన్ లాంటి చాలా మంది తారలు గ్రామాలను దత్త తీసుకున్నారు.

మహేష్ లాంటి స్టార్ హీరో సందేశం చెప్పినా అది అభిమానులకు బాగానే రీచ్ అవుతుందని ప్రూవ్ చేసింది శ్రీమంతుడు. అప్పటి వరకు సందేశాత్మక చిత్రాలు కమర్షియల్ సక్సెస్ లు సాధించవనే అపవాదును చెరిపేస్తు 140 కోట్లకు పైగా వసూళ్లతో తెలుగులో భారీ వసూళ్లను రాబట్టిన రెండో సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఈ సందర్భంగా వంద రోజులు పూర్తి చేసుకున్న శ్రీమంతుడు టీంకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement