'అర్జున్‌ రెడ్డి'పై మహేశ్‌ బాబు ప్రశంసల జల్లు | mahesh babu aplauds arjunreddy team | Sakshi
Sakshi News home page

'అర్జున్‌ రెడ్డి'పై మహేశ్‌ బాబు ప్రశంసల జల్లు

Sep 1 2017 10:59 PM | Updated on Jul 14 2019 1:11 PM

'అర్జున్‌ రెడ్డి'పై మహేశ్‌ బాబు ప్రశంసల జల్లు - Sakshi

'అర్జున్‌ రెడ్డి'పై మహేశ్‌ బాబు ప్రశంసల జల్లు

వివాదాలతో ప్రారంభమై హిట్ టాక్‌తో దూసుకుపోతున్న 'అర్జున్‌ రెడ్డి' మానియా కొనసాగుతోంది.

వివాదాలతో ప్రారంభమై హిట్ టాక్‌తో దూసుకుపోతున్న 'అర్జున్‌ రెడ్డి' మానియా కొనసాగుతోంది. టాలీవుడ్‌లో ట్రెండ్‌ సృష్టించి భారీ వసూళ్లు కొల్లగొడుతున్న ఈ సినిమాపై సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు పొగడ్తల వర్షం కురిపించారు. బోల్డ్‌, రా, ఇంటెన్స్‌, ఒరిజినల్‌ అండ్‌ బ్రిలియంట్‌ అంటూ..అర్జున్‌ రెడ్డి సినిమాను ఆకాశానికెత్తారు. 'మూస ధోరణిలో వస్తున్న చిత్రాలకు అర్జున్‌ రెడ్డి ఓ కొత్త మార్గాన్ని చూపించింది. అర్జున్‌ రెడ్డిగా లైఫ్‌ టైం పర్ఫార్మెన్స్‌తో విజయ్‌ దేవరకొండ అదరగొట్టారు. అద్భుతంగా నటించారని చెప్పడం కూడా తక్కువే. శాలిని, అర్జున్ రెడ్డి స్నేహితులు, మిగతా అన్ని పాత్రలు బ్రిలియంట్‌గా ఉన్నాయి.

దర్శకుడిగా సందీప్‌ వంగా కథ రాసుకొని తెరకెక్కించిన విధానం బాగుంది. తొలి సినిమానే ఇంత అద్భుతంగా తీయడం నమ్మలేకపోతున్నా' అంటూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement