మహానటి స్పెషల్‌ స్క్రీన్‌ టెస్ట్‌

Mahanati Special Screen Test - Sakshi

1 దర్శకుడిగా ‘మహానటి’ నాగ్‌ అశ్విన్‌కి రెండో సినిమా. ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఏంటో తెలుసా?
ఎ) పెళ్ళిచూపులు  బి) ఘాజీ  సి) అర్జున్‌ రెడ్డి డి) ఎవడే సుబ్రమణ్యం

2 సావిత్రి పెళ్లి చేసుకున్న జెమినీ గణేశన్‌ హీరో కాకముందు సినీ పరిశ్రమలో ఏ శాఖలో పని చేసేవారు?
ఎ) దర్శకుడు    బి) ఎడిటర్‌   సి) సింగర్‌     డి) కాస్టింగ్‌ మేనేజర్‌

3 ‘మహానటి’ చిత్రంలో సావిత్రి స్నేహితురాలు సుశీలగా నటించిన నటి ఎవరో తెలుసా? ఆమె గతేడాది నటించిన ఓ తెలుగు సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌?
ఎ) షాలినీ పాండే   బి) సమంత     సి) అనుష్క   డి) మాళవికా నాయర్‌

4 సావిత్రి మొదట మద్రాసులో అడుగుపెట్టినప్పుడు ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకత్వంలో నటించారు. అయితే హీరోయిన్‌గా కాదు. ఆ సినిమా పేరేంటి?
ఎ) పాతాళభైరవి    బి) సంసారం   సి) పలలెటూరి పిల్ల   డి) అర్ధాంగి

5 1957లో వచ్చిన ‘మాయా బజార్‌’ చిత్రంలో సావిత్రి ఓ పాత్రను అనుకరించారు. ఆమె ఏ పాత్రను అనుకరించారో తెలుసా?
ఎ) కృష్ణుడు         బి) అర్జునుడు   సి) అభిమన్యుడు  డి) ఘటోత్కచుడు

6 అక్కినేని నాగేశ్వరరావుతో సావిత్రి నటించిన ‘దేవదాసు’ చిత్రానికి దర్శకుడెవరో తెలుసా?
ఎ) వేదాంతం రాఘవయ్య    బి) ఘంటసాల బలరామయ్య    సి) విఠలాచార్య    డి) కమలాకర కామేశ్వరరావు

7 ‘మహానటి’ చిత్రదర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ‘తొడరి’ అనే  ఓ తమిళ సినిమా చూస్తున్నప్పుడు కీర్తీ సురేశ్‌ను సావిత్రిలా ఊహించుకున్నారట. ఆ తమిళ సినిమాలో హీరో ఎవరో తెలుసా?
ఎ) బాబీ సింహ  బి) శివ కార్తికేయన్‌   సి) ధనుష్‌       డి) సూర్య

8 1962వ సంవత్సరంలో ‘సావిత్రి గణేశ్‌’ పేరు మీద ‘వడ్డివారి పాలెం’అనే గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నిర్మించారు. అది ఏ జిల్లాలో ఉందో తెలుసా?
ఎ) నెల్లూరు జిల్లా బి) కృష్ణా జిల్లా   సి) గుంటూరు జిల్లా డి) చిత్తూరు జిల్లా

9 ‘మహానటి’  కథ వినమని ఓ హీరో కీర్తీ సురేశ్‌ను రికమెండ్‌ చేసి, ఆ చిత్రదర్శకుణ్ణి ఆమెకి పరిచయం చేశారు. సినిమా రిలీజైన తర్వాత ఆ హీరోకు కృతజ్ఞతలు తెలిపారామె. ఆ తెలుగు హీరో ఎవరు?
ఎ) విజయ్‌ దేవరకొండ   బి) నానీ   సి) రామ్‌   డి) దుల్కర్‌ సల్మాన్‌

10 సావిత్రి దర్శకత్వం వహించిన మొదటి సినిమా పేరేంటో తెలుసా?
ఎ) చిన్నారి పాపలు   బి) మాతృదేవత   సి) చిరంజీవి  డి) వింత సంసారం

11 సినిమాల్లోకి రాకముందు సావిత్రి ఓ నాటక సమాజంలో డాన్స్‌ చేసేవారు. ఆ నాటక సమాజ యజమాని తర్వాతి కాలంలో సినిమాల్లో అద్భుతంగా రాణించిన నటుడు. ఎవరా నాటక సంఘ యజమాని?
ఎ) గుమ్మడి   బి)చిత్తూరు వి.నాగయ్య    సి) ఎస్వీ. రంగారావు డి) కొంగర జగ్గయ్య

12 ‘మహానటి’లో ఓ సీన్‌లో యస్వీ రంగారావు పాత్రను చేసిన మోహన్‌బాబు సావిత్రి పాత్రధారి కీర్తీ సురేశ్‌కు ఓ సీన్‌లో భోజనం పెట్టించినట్లు చూపిస్తారు. కానీ ఒరిజినల్‌గా ఆ టైమ్‌లో భోజనం పెట్టింది వేరే నటుడని కొందరు అంటున్నారు. వాళ్లు చెప్పిన ఆ నటుడెవరు?
ఎ) రమణా రెడ్డి    బి) గుమ్మడి  సి) రేలంగి          డి) కాంతారావు

13 సావిత్రి భర్త జెమినీ గణేశన్‌ అసలు పేరు ‘రామస్వామి గణేశన్‌’. ఆమె ఆయన్ని ఏ సంవత్సరంలో వివాహం చేసుకున్నారో తెలుసా?
ఎ) 1950     బి) 1951    సి) 1952     డి) 1954

14 1960వ సంవత్సరంలో సావిత్రి రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. ఆమెకు అవార్డు తెచ్చిన ఆ సినిమా పేరేంటో తెలుసా?
ఎ) చివరకు మిగిలేది   బి) తొలిప్రేమ   సి) బాంధవ్యాలు   డి) మూగజీవులు

15 ‘మహానటి’ చిత్రంలో కె.వి. చౌదరి పాత్రను పోషించిన నటుడెవరు?
ఎ) మోహన్‌ బాబు   బి) రాజేంద్ర ప్రసాద్‌  సి) నాగచైతన్య    డి) క్రిష్‌

16 సావిత్రి ఏ సంవత్సరంలో తనువు చాలించారో తెలుసా?
ఎ) 1978      బి) 1991   సి) 1988      డి) 1981

17 సావిత్రి భర్త జెమినీ గణేశన్‌ ఆమెని ఏమని పిలిచేవారో కనుక్కోండి?
ఎ) శ్రీమతి గారు    బి) అమ్మణి   సి) అమ్మాడి           డి) బేబి

18 దిగ్దర్శకుడు కె.వి రెడ్డి ఓ చిన్న డాన్స్‌ సీక్వెన్స్‌లో నటించటానికి సావిత్రిని ఆడిషన్‌ చేశారు. అది చాలా చిన్న పాత్ర. అది ఏ సినిమా కోసమో తెలుసా?
ఎ) రూపవతి          బి) దేవదాసు   సి) పాతాళభైరవి   డి) ఆదర్శం

19 ‘దేవదాసు’ చిత్రంలో పార్వతి పాత్రకు మొదట అనుకున్న నటి సావిత్రి కాదు. మరి ఆ నటెవరో తెలుసా?
ఎ) షావుకారు జానకి   బి) భానుమతి   సి) అంజలీదేవి      డి) జమున

20 సావిత్రి నటించిన ఈ స్టిల్‌ ఏ సినిమాలోనిదో తెలుసా?
ఎ) మూగ మనసులు  బి) చదువుకున్న అమ్మాయిలు  సి) డాక్టర్‌ చక్రవర్తి   డి) తోడి కోడళ్లు

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) (డి) 2) (డి) 3) (ఎ)4) (బి) 5) (డి) 6) (ఎ) 7) (సి) 8) (సి) 9) (బి) 10) ఎ 11) (డి)
12) (బి) 13) (సి) 14) (ఎ) 15) (బి) 16) (డి) 17) (సి)18) (సి) 19) (ఎ)20) (ఎ)

నిర్వహణ: శివ మల్లాల

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top