గండిపేటలో 'మహానటి' | Mahanati Second Schedule | Sakshi
Sakshi News home page

గండిపేటలో 'మహానటి'

Jun 23 2017 2:02 PM | Updated on Sep 5 2017 2:18 PM

గండిపేటలో 'మహానటి'

గండిపేటలో 'మహానటి'

అలనాటి మేటినటి సావిత్రి బయోపిక్ మూవీ 'మహానటి' షూటింగ్ ప్రారంభమై ఇటీవల ఒక షెడ్యూల్ పూర్తి చేసుకొన్న విషయం

అలనాటి మేటినటి సావిత్రి బయోపిక్ మూవీ 'మహానటి' షూటింగ్ ప్రారంభమై ఇటీవల ఒక షెడ్యూల్ పూర్తి చేసుకొన్న విషయం తెలిసిందే. 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాతో విమర్శకుల ప్రశంసలను అందుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె స్వప్న దత్ 'స్వప్న సినిమా' పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా మరొక స్టార్ హీరోయిన్ సమంత కథలో కీలక పాత్ర పోషించనున్నారు. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుస్తున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ గండిపేటలో జరుగుతోంది. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్ లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement