అందరూ నేరస్తులే | maha prasthanam movie shooting launch | Sakshi
Sakshi News home page

అందరూ నేరస్తులే

Jan 4 2020 12:24 AM | Updated on Jan 4 2020 12:24 AM

maha prasthanam movie shooting launch - Sakshi

జాని, తనీష్, ముస్కాన్‌ సేథీ

తనీష్, ముస్కాన్‌ సేథీ జంటగా భానుశ్రీ మెహ్రా, రిషికా ఖన్నా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మహాప్రస్థానం’. ఓంకారేశ్వర క్రియేషన్స్‌పై దర్శకుడు జాని తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. జాని మాట్లాడుతూ– ‘‘మా సినిమాలో దాదాపు అన్నీ నెగిటివ్‌ క్యారెక్టర్‌లే ఉంటాయి. హీరోతో సహా ఇతర పాత్రలు కూడా నేరస్తులే. కొంతమంది నేరస్తుల మధ్య జరిగే ఒక క్రిమినల్‌ ఎమోషనల్‌ జర్నీ ఇది.

హీరో పాత్ర జీవిత ప్రయాణాన్ని చూపిస్తున్నందున ‘మహాప్రస్థానం’ అని టైటిల్‌ పెట్టాం. కానీ, ఇందులో శ్రీశ్రీగారి భావజాలం కనిపించదు’’ అన్నారు. ‘‘సమాజంలో మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు? అని చెప్పే కథ ఇది. ఏప్రిల్‌లో సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు తనీష్‌. ‘‘ఇటీవలే నాకు పెళ్లయింది.. అందుకే చిన్న విరామం తీసుకున్నా. చాలాకాలం తర్వాత తెలుగు సినిమాలో నటిస్తున్నా’’ అన్నారు భానుశ్రీ మెహ్రా. ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌ కశ్యప్, కెమెరా: బాల్‌ రెడ్డి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement