taneesh
-
అందరూ నేరస్తులే
తనీష్, ముస్కాన్ సేథీ జంటగా భానుశ్రీ మెహ్రా, రిషికా ఖన్నా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మహాప్రస్థానం’. ఓంకారేశ్వర క్రియేషన్స్‌పై దర్శకుడు జాని తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. జాని మాట్లాడుతూ– ‘‘మా సినిమాలో దాదాపు అన్నీ నెగిటివ్ క్యారెక్టర్లే ఉంటాయి. హీరోతో సహా ఇతర పాత్రలు కూడా నేరస్తులే. కొంతమంది నేరస్తుల మధ్య జరిగే ఒక క్రిమినల్ ఎమోషనల్ జర్నీ ఇది. హీరో పాత్ర జీవిత ప్రయాణాన్ని చూపిస్తున్నందున ‘మహాప్రస్థానం’ అని టైటిల్ పెట్టాం. కానీ, ఇందులో శ్రీశ్రీగారి భావజాలం కనిపించదు’’ అన్నారు. ‘‘సమాజంలో మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు? అని చెప్పే కథ ఇది. ఏప్రిల్‌లో సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు తనీష్. ‘‘ఇటీవలే నాకు పెళ్లయింది.. అందుకే చిన్న విరామం తీసుకున్నా. చాలాకాలం తర్వాత తెలుగు సినిమాలో నటిస్తున్నా’’ అన్నారు భానుశ్రీ మెహ్రా. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: బాల్ రెడ్డి. -
తనీష్ మహాప్రస్థానం
మహా ప్రస్థానం అనగానే మహాకవి శ్రీశ్రీ గుర్తుకు వస్తారు. ప్రస్తుతం ఓంకారేశ్వరా క్రియేషన్స్ పతాకంపై జానీ దర్శకత్వంలో ‘మహా ప్రస్థానం’ అనే చిత్రం రూపొందుతోంది. తనీష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘జర్నీ ఆఫ్ యాన్ ఎమోషనల్ కిల్లర్’ అనేది ఉపశీర్షిక. క్రైమ్ నేపథ్యంతో పాటు హృదయానికి హత్తుకునే ప్రేమకథతో ఈ సినిమా ఉంటుంది. చిత్రదర్శకుడు జానీ మాట్లాడుతూ– ‘‘కథానాయకుని కోణంలో సాగే కథ ఇది. ఎంతో భావోద్వేగంతో నిండిన ఈ కథకు తనీష్ చక్కగా సరిపోతాడు. హీరో పాత్రలోని ప్రేమ, బాధ, కోపం వంటి అన్ని భావాలను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: వసంత కిరణ్, యానాల శివ, సంగీతం: సునీల్ క«శ్యప్, పాటలు: ప్రణవం, కెమెరా: ఎం.ఎన్. బాల. -
లారాను తప్పుగా చిత్రీకరించలేదు
విజయవాడకు చెందిన పవన్ కుమార్ (లారా) కథతో ‘రంగు’ చిత్రం రూపొందింది. తనీష్ ముఖ్య పాత్రలో కార్తికేయ దర్శకత్వం వహించారు. పద్మనాభ రెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు నిర్మించారు. ఈ చిత్రంలో లారాను ఎలా చూపించబోతున్నారో మాకు తెలియాలి. మా అనుమతి తీసుకోకుండా సినిమా విడుదల చేస్తే థియేటర్స్‌లో ‘రంగు’ పడనివ్వం అని సోమవారం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు లారా బంధువులు. దానికి సమాధానంగా ‘రంగు’ చిత్రబృందం బుధవారం ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా పద్మనాభరెడ్డి మాట్లాడుతూ– ‘‘లారా బంధువుల ఆరోపణలు సబబుగానే అనిపించాయి. కానీ మేం లారాని ఎక్కడా తప్పుగా చూపించలేదు. సినిమా చూస్తే ఆయన మీద మంచి అభిప్రాయమే కలుగుతుంది. ఈ శని, ఆదివారాల్లో లారా కుటుంబ సభ్యులకు షో వేసి చిత్రాన్ని చూపిస్తాం. ఈ నెల 23న సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ‘‘మనిషి సమాజంలో ఎలా ఉండకూడదో చెప్పే సినిమా ఇది. లారా పాత్ర, ఐడియాలజీ.. అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. సినిమా చూస్తే వాళ్ల కుటుంబ సభ్యులకు కళ్లలో నీళ్లు తిరుగుతాయి’’ అని తనీష్ అన్నారు. ‘‘2011 నుంచి నేను లారాని స్టడీ చేసి ఈ కథ రాసుకున్నాను. ఆయన బావమరిదిని కలవలేదు. కానీ ఆయన స్నేహితులను కలిశాను. సినిమా చూస్తే లారా మన మధ్య ఇంకా తిరుగుతున్నారనే భావన కలుగుతుంది’’ అని కార్తికేయ అన్నారు. చిత్రనిర్మాత నల్ల అయ్యన్న నాయుడు, సహ నిర్మాత వాసు పాల్గొన్నారు. -
రంగు పడనివ్వం
తనీశ్, పరుచూరి రవి, ప్రియా సింగ్, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణమురళి, షఫీ ముఖ్య తారలుగా కార్తికేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగు’. నల్లస్వామి సమర్పణలో యు అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎ.పద్మనాభ రెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలవుతోంది. విజయవాడకు చెందిన లారా (పవన్ కుమార్) అనే వ్యక్తి జీవితం ఆధారంగా ‘రంగు’ సినిమా తెరకెక్కించారు. లారా కుటుంబ సభ్యుడైన దిలీప్, స్నేహితులు సందీప్, ధనుంజయ్ ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దిలీప్ (లారా బావ మరిది) మాట్లాడుతూ– ‘‘లారా గురించి సమాచారం సేకరించడానికి దర్శకుడు కార్తికేయ ఏడాది క్రితం విజయవాడ వచ్చినప్పుడు మమ్మల్ని సంప్రదించలేదు. పది రోజుల క్రితం సినిమా ట్రైలర్, ప్రెస్‌మీట్ చూశాం. లారా అనే రౌడీషీటర్.. అనే వాయిస్‌తో ట్రైలర్ మొదలైంది. లారా మీద రౌడీషీట్ అన్యాయంగా తెరిచారు. ఇప్పుడు ఆయన పిల్లలు చదువుకుంటున్నారు. ఈ సినిమా రిలీజ్ అయితే వాళ్ల మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో ఆలోచించాలి. సినిమా ట్రైలర్ చూసిన దగ్గర నుంచి ‘రంగు’ దర్శక, నిర్మాతలను కలవాలని ప్రయత్నించాను, కానీ కుదరలేదు. సినిమాని ముందుగా మాకు చూపించి, మా అంగీకారంతోనే విడుదల చేయాలి. లేదంటే సినిమా విడుదలని లీగల్‌గా అడ్డుకుంటాం. విజయవాడలో పోస్టర్ పడనీయం’’ అన్నారు. లారా స్నేహితులు సందీప్, ధనుంజయ్ పాల్గొన్నారు. -
‘కాలా’ కెమెరాతో...
తనీష్, షిరీన్ జంటగా నగేష్ నారదాసి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేశ దిమ్మరి’. సవీణ క్రియేషన్స్ బ్యానర్‌పై స్వతంత్ర గోయల్ (శావి యుఎస్ఎ) నిర్మించిన ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. నాగేష్ నారదాసి మాట్లాడుతూ– ‘‘సరికొత్త కథాంశంతో రూపొందిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, సిమ్లా వంటి అందమైన ప్రదేశాల్లో షూటింగ్ చేశాం. సుభాష్ ఆనంద్ సంగీతం, ప్రదీష్ ఆంటోని కొరియోగ్రఫీ హైలైట్‌గా ఉంటాయి. రజనీకాంత్ ‘కాలా’ సినిమాని చిత్రీకరించిన హిలీనీయం 8ఆర్ లేటెస్ట్ వెర్షన్ కెమెరాతో మా చిత్రాన్ని తెరకెక్కించాం. ‘హే పైసా...’ అంటూ డబ్బుపై వచ్చే ఓ సెటైరికల్ సాంగ్‌ని తనీష్ పాడారు’’ అన్నారు. ‘‘ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. జూలైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు స్వతంత్ర గోయల్. -
డ్రగ్స్ కేసులో హీరో నందు విచారణ పూర్తి
హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ ఫోన్‌కాల్స్ డేటా ఆధారంగా వర్థమాన హీరో నందు అలియాస్ ఆనంద కృష్ణను సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. డ్రగ్స్ కేసులో భాగంగా 12వ రోజు మంగళవారం ఉదయం నందు నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయానికి హాజరయ్యారు. కెల్విన్, జీశాన్‌లతో నందుకు పరిచయం ఉందని, అందులో భాగంగానే డ్రగ్స్ వ్యవహారంపై ప్రశ్నించనున్నామని సిట్ అధికారులు ఇప్పటికే వెల్లడించిన విషయం విదితమే. ఆ దిశగా సిట్ అధికారులు...నందూను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సుమారు మూడు గంటల పాటు ఆయన్ని సిట్ అధికారులు విచారణ జరిపారు. ప్రధానంగా కెల్విన్‌తో సంబంధంపై సిట్ ఆరా తీసినట్లు తెలిసింది. నందు విచారణతో తొలి విడత విచారణ పూర్తయింది. కాగా వర్ధమాన నటుడు తనీష్‌ను కూడా సిట్ నిన్న ప్రశ్నించిన విషయం విదితమే. ఇప్పటివరకూ సిట్ అధికారులు చిత్రపరిశ్రమకు చెందిన 11మందిని విచారణ చేశారు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరా మెన్ శ్యామ్ కే నాయుడు, నటుడు సుబ్బరాజు, హీరోలు తరుణ్, నవదీప్, సినీనటి చార్మీ, ముమైత్ ఖాన్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, హీరో రవితేజ, ఆయన డ్రైవర్ శ్రీనివాసరావు, తనీష్ సిట్ విచారణకు హాజరయ్యారు. కాగా తర్వలో మరికొందరికి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. -
భార్యకు శీల పరీక్ష పెట్టిన భర్త
భార్యను శీల పరీక్షకు నిలిపిన భర్త కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో జంగాల కాలనీకి చెందిన పస్తం బాలకృష్ణ తన భార్య తిరుమలమ్మను శీల పరీక్షకు నిలిపాడు. ఇటీవల ఆమె బండిపాలెం గ్రామానికి చెందిన నరసింహారావుకు చెందిన కిరాయి ఆటో ఎక్కింది. ఆ సమయంలో అతడు తిరుమలమ్మతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీన్ని ఆమె భర్తకు చెప్పగా అతను అనుమానంతో ఆమెకు శీల పరీక్ష చేయించాలని నిర్ణయించుకున్నాడు. కుల పెద్దలకు సమాచారమిచ్చి వారిని గురువారం తెల్లవారుజామున చిల్లకల్లు-మక్కపేట రహదారి ఎన్ఎస్పీ కాల్వగట్టు వద్దకు రావాలని కోరాడు. వారు వచ్చేసరికి గట్టుపై కట్టెల పొయ్యి వెలిగించి ఆకురాయిని ఎర్రగా కాల్చాడు. ముందుగా భార్య శరీరానికి పసుపు పూసి కుంకుమ పెట్టాడు. ఆ తర్వాత కాలిన ఆకురాయిని నిప్పుల్లో నుంచి తీసి చేత్తో పట్టుకుని శీలపరీక్షలో నెగ్గాలని తిరుమలమ్మకు సూచించాడు. ఈ విషయం తెలుసుకున్న చిల్లకల్లు ఎస్.ఐ. షణ్ముఖసాయి, సిబ్బందితో వెళ్లి సంఘటనను అడ్డుకున్నారు. కుల పెద్దలు, భార్యాభర్తలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. - చిల్లకల్లు (జగ్గయ్యపేట) -
భార్యకు శీల పరీక్ష పెట్టిన భర్త