‘కాలా’ కెమెరాతో... | Hero Tanish turns singer | Sakshi
Sakshi News home page

‘కాలా’ కెమెరాతో...

Jun 18 2018 1:29 AM | Updated on Jun 18 2018 1:29 AM

Hero Tanish turns singer - Sakshi

తనీష్, షిరీన్‌ జంటగా నగేష్‌ నారదాసి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేశ దిమ్మరి’. సవీణ క్రియేషన్స్‌ బ్యానర్‌పై స్వతంత్ర గోయల్‌ (శావి యుఎస్‌ఎ) నిర్మించిన ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. నాగేష్‌ నారదాసి మాట్లాడుతూ– ‘‘సరికొత్త కథాంశంతో రూపొందిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది.

పంజాబ్, హిమాచల్‌ ప్రదేశ్, హర్యానా, సిమ్లా వంటి అందమైన ప్రదేశాల్లో షూటింగ్‌ చేశాం. సుభాష్‌ ఆనంద్‌ సంగీతం, ప్రదీష్‌ ఆంటోని కొరియోగ్రఫీ హైలైట్‌గా ఉంటాయి. రజనీకాంత్‌ ‘కాలా’ సినిమాని చిత్రీకరించిన హిలీనీయం 8ఆర్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ కెమెరాతో మా చిత్రాన్ని తెరకెక్కించాం. ‘హే పైసా...’ అంటూ డబ్బుపై వచ్చే ఓ సెటైరికల్‌ సాంగ్‌ని తనీష్‌ పాడారు’’ అన్నారు. ‘‘ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది. జూలైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు స్వతంత్ర గోయల్‌.

Advertisement
 
Advertisement
Advertisement