దేవుడి కన్నా భక్తే గొప్ప! | maha bhaktha siriyala movie platinum disc function | Sakshi
Sakshi News home page

దేవుడి కన్నా భక్తే గొప్ప!

Feb 19 2014 11:04 PM | Updated on Sep 2 2017 3:52 AM

దేవుడి కన్నా భక్తే గొప్ప!

దేవుడి కన్నా భక్తే గొప్ప!

తారకరత్న, అర్చన నాయకా నాయికలుగా ముద్దపు రాంబాబు దర్శకత్వంలో వల్లభనేని వెంకటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘మహాభక్త సిరియాళ’.

 తారకరత్న, అర్చన నాయకా నాయికలుగా ముద్దపు రాంబాబు దర్శకత్వంలో వల్లభనేని వెంకటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘మహాభక్త సిరియాళ’. శివరాత్రి పండగ సందర్భంగా ఈ 27న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం పాటలకు ప్రేక్షకాదరణ లభించిన నేపథ్యంలో బుధవారం ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ -‘‘భగ వంతునికన్నా భక్తే గొప్పదనే కథాంశంతో ఈ సినిమా నిర్మించాం. అన్ని వర్గాలవారికి నచ్చే సినిమాగా దర్శకుడు తెరకెక్కించారు. పదిహేను నిమిషాల పాటు సాగే గ్రాఫిక్స్ అదనపు ఆకర్షణగా నిలుస్తాయి’’ అని చెప్పారు.
 
  ఈ వేడుకలో పాల్గొన్న సముద్ర, టి. ప్రసన్నకుమార్, రామసత్యనారాయణ సినిమా విజయం సాధించాలని అభిలషించారు. తారకరత్న, అర్చన సినిమా విజయం సాధిం చాలనే ఆకాంక్షను వ్యక్తపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement