జీవీతో మడోనా సెబాస్టియన్ రొమాన్స్ | madona Sebastian romance with GV prakash | Sakshi
Sakshi News home page

జీవీతో మడోనా సెబాస్టియన్ రొమాన్స్

Jan 7 2017 3:05 AM | Updated on Sep 5 2017 12:35 AM

జీవీతో మడోనా సెబాస్టియన్  రొమాన్స్

జీవీతో మడోనా సెబాస్టియన్ రొమాన్స్

యువ సంగీత దర్శకుడు, నటుడు జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో ప్రేమమ్‌ చిత్రం మడోనా సెబాస్టియన్ రొమాన్స్ కు రెడీ అవుతున్నారు.

యువ సంగీత దర్శకుడు, నటుడు జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో ప్రేమమ్‌ చిత్రం మడోనా సెబాస్టియన్ రొమాన్స్ కు రెడీ అవుతున్నారు. కోలీవుడ్‌లో ప్రామిసింగ్‌ యువ కథానాయకులలో జీవీ.ప్రకాశ్‌కుమార్‌ ఒకరు.అలాగే యమ బిజీగా ఉన్న హీరోల్లో మొదటి స్థానంలో ఉన్నది ఈయనే. ప్రస్తుతం జీవీ చేతిలో అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి.అడంగాదే, 4జీ, సర్వం తాళ మాయం, విర్గిన్ మాప్పిళ్‌లై చిత్రాలతో పాటు, రాంబాలా దర్శకత్వంలో ఒక చిత్రం, శశి దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నారు. తాజాగా మరో చిత్రం కమిట్‌ అయ్యారు. ఇంతకు ముందు విజయ్‌సేతుపతి కథానాయకుడిగా ఆరంజ్‌ మిఠాయ్, రెక్క చిత్రాలను నిర్మించిన గణేశ్‌ తన కామ్న పతాకంపై నిర్మించనున్న తాజా చిత్రంలో జీవీ కథానాయకుడిగా నటించనున్నారు.

ఇందులో ఆయనకు జంటగా ప్రేమమ్‌ చిత్రం ఫేమ్‌ మడోనా సెబాస్టియన్ నటించనున్నట్లు సమాచారం. దీనికి ఇంతకు ముందు ఈటీ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన రవిఅరసు దర్శకత్వం వహించనున్నారు.ఈ చిత్రానికి సంబంధించి నూతన సంవత్సరం సందర్భంగా జనవరి ఒకటవ తేదీన జీవీపై ఫొటో షూట్‌ చేశారు. ఆ ఫొటోలు చూసిన జీవీ.ప్రకాశ్‌ కుమార్‌ చాలా బాగున్నాయంటూ దర్శకుడిని అభినందించారట.ఈ చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మరో విషయం ఏమిటంటే జీవీ.ప్రకాశ్‌ కుమార్‌ నటించిన బ్రూస్‌లీ చిత్రం త్వరలో తెరపైకి రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement