మాధురీ దీక్షిత్కు యువకుడి బెదిరింపులు | Madhuri Dixit threatened by youth | Sakshi
Sakshi News home page

మాధురీ దీక్షిత్కు యువకుడి బెదిరింపులు

Dec 6 2014 10:46 AM | Updated on Apr 3 2019 6:23 PM

మాధురీ దీక్షిత్కు యువకుడి బెదిరింపులు - Sakshi

మాధురీ దీక్షిత్కు యువకుడి బెదిరింపులు

బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్కు ఓ యువకుడి నుంచి బెదిరింపులు వచ్చాయి.

ముంబై: బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్కు ఓ యువకుడి నుంచి బెదిరింపులు వచ్చాయి. డబ్బులు ఇవ్వాలని లేకుంటే మీ పిల్లలను చంపేస్తానంటూ మాధురిని హెచ్చరించాడు. మాధురీ ఫోన్కు ఈ విధంగా మెసేజ్ పంపాడు. గురువారం రోజు ఆ యువకుడు నాలుగు సార్లు మెసేజ్ పంపాడు. తాను గ్యాంగ్స్టర్ చోటా రాజన్ వద్ద పనిచేస్తున్నాని ఆ యువకుడు మెసేజ్లో తెలియజేశాడు.

మాధురి ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఓ మేగజైన్ నుంచి మాధురి ఫోన్ నెంబర్ సంపాదించినట్టు నిందితుడు విచారణలో వెల్లడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement