మాధవన్‌కు విలన్‌గా విజయ్‌సేతుపతి? | Madhavan, Vijay Sethupathi to share screen space in Pushkar-Gayathri's next? | Sakshi
Sakshi News home page

మాధవన్‌కు విలన్‌గా విజయ్‌సేతుపతి?

Feb 16 2016 2:40 AM | Updated on Aug 17 2018 2:34 PM

మాధవన్‌కు విలన్‌గా విజయ్‌సేతుపతి? - Sakshi

మాధవన్‌కు విలన్‌గా విజయ్‌సేతుపతి?

కోలీవుడ్‌లో తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త హల్‌చల్ చేస్తోంది. నటుడు మాధవన్‌కు విలన్‌గా విజయ్‌సేతుపతిని నటింపచేసే ప్రత్నాలు జరుగుతున్నాయన్నదే ఆ ప్రచారం.

కోలీవుడ్‌లో తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త హల్‌చల్ చేస్తోంది. నటుడు మాధవన్‌కు విలన్‌గా విజయ్‌సేతుపతిని నటింపచేసే ప్రత్నాలు జరుగుతున్నాయన్నదే ఆ ప్రచారం. మాధవన్ చాలా గ్యాప్ తరవాత నటించిన తమిళ చిత్రం ఇరుదుచుట్రు. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణను చూరగొంది. ఆ చిత్ర విలేకరుల సమావేశంలో ఇకపై తమిళ చిత్రాలపై దృష్టి సారిస్తానని మాధవన్ చెప్పడంతో దర్శక, నిర్మాతల చూపు ఆయనపై పడుతోంది. ఇప్పటికే దర్శక ద్వయం పుష్కర్-గాయత్రి తమ చిత్రంలో మాధవన్‌ను హీరోగా ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఆయనకు కథను కూడా వినిపించారు. మాధవన్ పచ్చ జెండా ఊపడమే ఆలస్యం షూటింగ్‌కు రెడీ అంటున్నారు.

ఇంతకు ముందు ఓరంపో, వా తదితర చిత్రాలను తెరకెక్కించిన పుష్కర్-గాయత్రి తాజా చిత్రం గురించి తెలుపుతూ మాధవన్‌కు కథ వినిపించిన మాట నిజమేనన్నారు. అయితే ఆయన ఆలోచించుకోవడానికి ఒక వారం గడువు అడిగారని చెప్పారు. ఇది తమ గత చిత్రాలకు మాత్రమే కాకుండా మాధవన్ ఇంతకు ముందు నటించిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఇందులో ప్రతినాయకుడి పాత్రలో విజయ్‌సేతుపతిని నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు కోలీవుడ్ టాక్. అయితే హీరోగా ఫుల్ బిజీలో ఉన్న ఆయన విలన్‌గా అంగీకరిస్తారా? అన్నదే చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement