‘సైలెంట్‌’ సినిమాలో అనుష్క | Madhavan And Anushka To Star In Silent Thriller | Sakshi
Sakshi News home page

Aug 25 2018 11:44 AM | Updated on Aug 25 2018 1:04 PM

Madhavan And Anushka To Star In Silent Thriller - Sakshi

ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలకు రచయితగా పనిచేసిన స్టార్ రైటర్ కోన వెంకట్‌ ఇటీవల నిర్మాతగానూ మంచి విజయాలు సాధిస్తున్నారు. తాజాగా ఈయన నిర్మాణ సారధ్యంలో మరో సినిమాను ప్రకటించారు. బహు భాషా నటుడు మాధవన్‌, సౌత్ స్టార్‌ హీరోయిన్‌ అనుష్కల కాంబినేషన్‌లో కోన వెంకట్‌ సహ నిర్మాతగా  ఓ సినిమా తెరకెక్కనుంది.

సైలెంట్ పేరుతో సైలెంట్ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మించనున్నారు. సూపర్‌ హిట్ థ్రిల్లర్‌ సినిమాల్లో నటించిన మాధవన్ క్రైం థ్రిల్లర్‌ గా తెరకెక్కనున్న సైలెంట్ సినిమాలో కీ రోల్‌ ప్లే చేయనున్నారు. భాగమతి తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న అనుష్క ఈ సినిమాలో మరో డిఫరెంట్‌ రోల్‌లో అలరించనున్నారు. ఈ సినిమాకు వస్తాడు నా రాజు సినిమాకు దర్శకత్వం వహించిన హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించనున్నారు. పలువురు అంతర్జాతీయ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement
 
Advertisement
Advertisement