మరో అస్త్రంతో మధుర్ భండార్కర్ రెడీ! | 'Madamji' script, cast in final stage | Sakshi
Sakshi News home page

మరో అస్త్రంతో మధుర్ భండార్కర్ రెడీ!

Sep 12 2014 12:55 PM | Updated on Apr 3 2019 6:23 PM

మరో అస్త్రంతో మధుర్ భండార్కర్ రెడీ! - Sakshi

మరో అస్త్రంతో మధుర్ భండార్కర్ రెడీ!

ఇంతకుముందు ఫ్యాషన్, పేజ్3 లాంటి సినిమాలతో నగరాల్లో విశృంఖలంగా సాగుతున్న సంస్కృతిని, అందులోని భిన్న పార్శ్వాలను ఎండగట్టిన బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్ ఇప్పుడు మరో అస్త్రం బయటకు తీస్తున్నారు.

ఇంతకుముందు ఫ్యాషన్, పేజ్3 లాంటి సినిమాలతో నగరాల్లో విశృంఖలంగా సాగుతున్న సంస్కృతిని, అందులోని భిన్న పార్శ్వాలను ఎండగట్టిన బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్ ఇప్పుడు మరో అస్త్రం బయటకు తీస్తున్నారు. 'మేరీ కోమ్' సినిమా విజయంతో దూసుకెళ్తున్న ప్రియాంకా చోప్రా తొలిసారిగా నిర్మాతగా మారి.. 'మేడమ్ జీ' అనే చిత్రం తీయబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్ర్రిప్టు, ఇతర వ్యవహారాలన్నింటినీ మధుర్ భండార్కర్ చూసుకుంటున్నారు.

సినిమాలో ఎవరెవరు నటిస్తారన్న విషయం ఇంకా తేలాల్సి ఉందని, అవన్నీ అయ్యేసరికి నవంబర్ అవుతుందని ప్రియాంకా చోప్రా చెబుతోంది. మేడమ్జీ సినిమాలో ప్రియాంకా చోప్రా ఎటూ ప్రధానపాత్రలో నటిస్తుంది. మిగిలినవాళ్ల సంగతే తేలాలి. భండార్కర్ తీసిన 'ఫ్యాషన్' సినిమాలో కూడా ఆమె నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో నటనకు ఆమెకు జాతీయ ఉత్తమనటి అవార్డు కూడా వచ్చింది. తాను మొట్టమొదటిసారిగా తీసే సినిమాకు దర్శకత్వం వహించడానికి మధుర్ భండార్కర్ అంగీకరించినందుకు తానెంతో కృతజ్ఞురాలినై ఉంటానని ప్రియాంక చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement