మహేష్ బాబు కూడా లుంగీ డాన్స్ ... | Lungi dance in Aagadu with Mahesh Babu | Sakshi
Sakshi News home page

మహేష్ బాబు కూడా లుంగీ డాన్స్ ...

Jul 31 2014 1:57 PM | Updated on Jul 14 2019 1:42 PM

మహేష్ బాబు కూడా లుంగీ డాన్స్ ... - Sakshi

మహేష్ బాబు కూడా లుంగీ డాన్స్ ...

డాన్సుల్లో 'లుంగీ డాన్స్' ప్రస్తుతం ట్రెండ్ సెట్టర్గా చెప్పుకోవచ్చు. 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌' చిత్రంతో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తెర లేపిన లుంగీ డాన్స్ దేశ‌మంతా సంచ‌ల‌నం సృష్టించింది.

డాన్సుల్లో 'లుంగీ డాన్స్' ప్రస్తుతం ట్రెండ్ సెట్టర్గా చెప్పుకోవచ్చు. 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌' చిత్రంతో  బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తెర లేపిన లుంగీ డాన్స్ దేశ‌మంతా సంచ‌ల‌నం సృష్టించిన విషయం తెలిసిందే.  దాంతో ఈ డాన్స్కు పిచ్చి క్రేజ్ రావటంతో మ‌న హీరోలూ ఫాలో అవుతున్నారు.  అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్, ఇద్దర‌మ్మాయిలు  సినిమాలో అమ‌లాపాల్ లుంగీ డాన్స్ చేసి ఆక‌ట్టుకుంటే... తాజాగా శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న 'ఆగడు' చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు కూడా లుంగీ డాన్స్ చేశాడట.

ఫిల్మ్ నగర్లో ఈ వార్త ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారింది. ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో మహేష్ బాబు, శ్రుతిహాసన్ల‌పై ఐటం సాంగ్  చిత్రీక‌రించారు. ఆ పాట‌లో.. మ‌హేష్ లుంగీ డాన్స్ చేశాడ‌ట‌. లుంగీ డాన్స్ అదిరిపోయే రీతిలో వ‌చ్చింద‌ని టాక్ వస్తోంది. మహేష్ బాబుతో పాటు విలన్ సోనూ సూద్ కూడా చిందులు వేశాడట. ఈ లుంగీ డాన్స్ పాటలో శ్రుతిహాసన్ గొంతు కలిపిందట. గతంలో సూపర్ డూపర్ హిట్ అయిన పోకిరి చిత్రంలో ఓ పాటలో మహేష్ లుంగీలో కనిపించాడు.

ఈ సినిమాకు ఈ పాట హైలెట్ అని చిత్ర యూనిట్ చెప్పటం విశేషం. ఆగడు ఆడియోను మహేష్ బాబు కొడుకు గౌతమ్ పుట్టినరోజుకు విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇక ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక సంగీత దర్శకత్వం వహిస్తున్న తమన్కు ఈ చిత్రం 50వది కావటం విశేషం. మహేష్ బాబు సరసన తొలిసారి మిల్కీ బ్యూటీ తమన్న నటిస్తోంది.

 

14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై అనిల్ సుంకర, గోపీచంద్, రామ్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక తెగ పాపులర్ అయిన ‘లుంగీ’ వెనుక ఒక కథ ఉంది. అటు అభిమానుల్నీ... ఇటు విమర్శకుల నోళ్లలోనూ తెగ పాపులర్ అయిన ఈ డాన్స్‌ని రూపొందించింది ప్రముఖ కొరియోగ్రాఫర్ చిన్ని ప్రకాష్. షారుఖ్‌ ఖాన్ - దీపికా పదుకొనె హాట్‌హాట్‌గా డాన్స్ చేసిన ఆ పాట చిత్రీకరణకు సుమారు 30 గంటలు పట్టిందట.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement