స్నేహం కోసం.. సూపర్‌స్టార్‌ | Lullaby lullaby araro movie audio launch the Rajinikanth | Sakshi
Sakshi News home page

స్నేహం కోసం.. సూపర్‌స్టార్‌

Apr 14 2017 9:34 PM | Updated on Sep 5 2017 8:46 AM

స్నేహం కోసం.. సూపర్‌స్టార్‌

స్నేహం కోసం.. సూపర్‌స్టార్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఇటీవల తన స్నేహితులు, సన్నిహితులను ప్రోత్సహించడానికి ముందుంటున్నారు.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఇటీవల తన స్నేహితులు, సన్నిహితులను ప్రోత్సహించడానికి ముందుంటున్నారు. అలాంటి కార్యక్రమాల్లో చక్కని సూచనలు కూడా ఇస్తున్నారు. తాజాగా తనకు మంచి మిత్రుడైన నటుడు చరణ్‌రాజ్‌ వారసుడి చిత్ర ఆడియోను ఆవిష్కరించి ఆ నవ కథానాయకుడిని ప్రోత్సహించారు. బాషా చిత్రంలో చరణ్‌రాజ్‌ రజనీకాంత్‌కు స్నేహితుడిగా నటించారు. ఆయన కొడుకు తేజ్‌ చరణ్‌రాజ్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం లాలి లాలి ఆరారో. నూతన నటి శివాని నాయకిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని లింగన్‌ రాజాళి దర్శకత్వంలో అరుణ్‌పాండియన్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఏ.అరుణ్‌పాండియన్‌ నిర్మిస్తున్నారు.

కుటుంబ అనుబంధాలను ఆవిష్కరించే విధంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం చక్కని సెంటిమెంట్, ఎమోషన్‌తో కూడిన లవ్‌ ఎంటర్‌టెయినర్‌గా ఉంటుందంటుందని చిత్ర యూనిట్‌ తెలిపింది. షూటింగ్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న లాలి లాలి ఆరారో చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ చిత్ర ఆడియోను తమిళ నూతన సంవత్సరం రోజైన శుక్రవారం రజనీకాంత్‌ తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన చరణ్‌రాజ్‌ వారసుడికి ఆశీస్సులు అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement