ముంబయ్ భామతో ప్రేమాయణం | Love affair with mumbai girl | Sakshi
Sakshi News home page

ముంబయ్ భామతో ప్రేమాయణం

May 21 2014 10:32 PM | Updated on Sep 2 2017 7:39 AM

ముంబయ్ భామతో ప్రేమాయణం

ముంబయ్ భామతో ప్రేమాయణం

ప్రేమకథా చిత్రాలకు నప్పే హీరో నితిన్. ప్రేమకథా చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించే నైపుణ్యం ఉన్న దర్శకుడు కరుణాకరన్.

ప్రేమకథా చిత్రాలకు నప్పే హీరో నితిన్. ప్రేమకథా చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించే నైపుణ్యం ఉన్న దర్శకుడు కరుణాకరన్. ఈ ఇద్దరి కలయికలో ఓ సినిమా వస్తే.. అది కూడా వారి తరహా ప్రేమకథా చిత్రమైతే?... చెప్పడానికేముంటుంది? ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టే సినిమా ఇస్తారని చెప్పొచ్చు. ఈ కాంబినేషన్లో శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తున్న సినిమా బుధవారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. నితిన్‌తో ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’వంటి రెండు విజయవంతమైన చిత్రాల తర్వాత ఈ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఇది. నిఖితారెడ్డి, సుధాకర్‌రెడ్డి సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్‌గౌడ్ సమర్పకుడు. బాలీవుడ్ భామ మిస్తీ కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి సదానంద్ గౌడ్ కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత రామ్మోహన్ రావు క్లాప్ ఇచ్చారు. వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. వచ్చే నెల 2న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, ఇక్కడే కాకుండా విదేశాల్లోనూ షూటింగ్ చేయనున్నామని నిఖితారెడ్డి తెలిపారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement