కరుణాకరన్ రీ-ఎంట్రీ.. బెల్లంకొండతో క్రేజీ హీరోయిన్ | Director Karunakaran re-entry with Bellam Konda Ganesh | Sakshi
Sakshi News home page

కరుణాకరన్ రీ-ఎంట్రీ.. బెల్లంకొండతో క్రేజీ హీరోయిన్

Apr 20 2026 11:41 PM | Updated on Apr 21 2026 12:38 PM

Director Karunakaran re-entry with Bellam Konda Ganesh

‘తొలి ప్రేమ, హ్యాపీ, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్‌’ వంటి చిత్రాలతో తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన దర్శకుడు కరుణాకరన్. చాలా కాలం తర్వాత మళ్లీ తెరపైకి వచ్చారు. ఆయన దర్శకత్వంలో బెల్లంకొండ గణేశ్ హీరోగా కొత్త సినిమా ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దర్శకుడు వీవీ వినాయక్ ప్రత్యేక అతిథిగా హాజరై, క్లాప్ కొట్టారు. ‘‘న్యూ ఏజ్‌ రొమాంటిక్‌ కామెడీగా రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమా కరుణాకరన్‌ శైలిలో సున్నితమైన, ఎమోషనల్‌ లవ్‌ స్టోరీ అని తెలుస్తోంది.

ఈ చిత్రానికి జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ మాటలు రాస్తున్నాడు. కామెడీ సన్నివేశాల్లో కరుణాకరన్‌కు ప్రత్యేకమైన స్టయిల్ ఉండగా, అనుదీప్‌కు కూడా హాస్యంలో మంచి పట్టుంది. వీరి కలయికతో వినోదం మరింత పెరిగే అవకాశం ఉంది. సంగీతం అందించబోతున్నది భీమ్స్.  

ఈ సినిమాలో బెల్లంకొండ గణేశ్ సరసన ఓ క్రేజీ హీరోయిన్‌ను తీసుకోవాలని యూనిట్ నిర్ణయించింది. హీరోయిన్ ఎంపికతో ఈ ప్రాజెక్ట్‌కు మరింత వెయిట్ యాడ్ కానుంది. కరుణాకరన్, అనుదీప్ కలయికలో రాబోతున్న ఈ సినిమా వినోదభరితంగా ఉండబోతుందనే అంచనాలు ఉన్నాయి. బెల్లంకొండ గణేశ్ కెరీర్‌లో కూడా ఇది కీలక ప్రాజెక్ట్‌గా మారే అవకాశం ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement