లుక్ బాగా కుదిరింది | look is perfect | Sakshi
Sakshi News home page

లుక్ బాగా కుదిరింది

Mar 13 2015 11:04 PM | Updated on Jul 14 2019 1:22 PM

లుక్ బాగా కుదిరింది - Sakshi

లుక్ బాగా కుదిరింది

‘‘నేను హీరోను కాక ముందు గోపీచంద్‌ను గోపీకృష్ణా మూవీస్ ఆఫీస్‌లో ఓసారి కలిశాను. ‘వర్షం’ సినిమా చేస్తున్నప్పుడు మా స్నేహం పెరిగింది.

‘‘నేను హీరోను కాక ముందు గోపీచంద్‌ను గోపీకృష్ణా మూవీస్ ఆఫీస్‌లో ఓసారి కలిశాను. ‘వర్షం’ సినిమా చేస్తున్నప్పుడు మా స్నేహం పెరిగింది. అప్పట్నుంచీ మేం చేసే సినిమాల గురించి చర్చించుకుంటాం. ఈ చిత్రానికి మంచి కథ, స్క్రీన్‌ప్లే కుదిరాయి. పాటలు కూడా బాగున్నాయి. నాకు ‘స్వింగ్ స్వింగ్’ అనే పాట బాగా నచ్చింది’’ అని హీరో ప్రభాస్ అన్నారు. గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా యూవీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం - ‘జిల్’. ప్రమోద్, వంశీ నిర్మించిన ఈ చిత్రానికి జిబ్రాన్ పాటలు స్వరపరిచారు.

ఈ పాటల సీడీని ప్రభాస్ ఆవిష్కరించి, గోపీచంద్‌కు ఇచ్చారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ -‘‘వాస్తవానికి ఈ చిత్రకథను రాధాకృష్ణ ఏడాదిన్నర క్రితం చెప్పాడు. నా కోసం వెయిట్ చేశాడు. దర్శక, నిర్మాతలు నన్నో కొత్త లుక్‌లో చూపించాలని, ఈ సినిమా మొదలుపెట్టారు. నిజంగానే లుక్ బాగా కుదిరింది. సినిమా కూడా బాగా వచ్చింది. ప్రేమకథ నేపథ్యంలో సాగే స్టయిల్ యాక్షన్ మూవీ ఇది.

పాటలు, డాన్సులు, ఫైట్స్, ఫొటోగ్రఫీ... అన్నీ బాగుంటాయి’’ అన్నారు. జిబ్రాన్, రాశీఖన్నా తదితరులు చిత్ర విజయంపై తమ నమ్మకాన్ని వ్యక్తపరిచారు. ఇందులో గోపీచంద్ కొత్తగా కనిపిస్తారని దర్శకుడు తెలిపారు. నిర్మాత ఆనంద ప్రసాద్, దర్శకులు శ్రీవాస్, సుజిత్, అశోక్, మారుతి తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement