లాక్‌డౌన్‌: చిరకాల మిత్రుడిని పెళ్లాడిన దర్శకురాలు

Lockdown: Filmmaker Sumana Kittur Got Married Photographer Srinivas - Sakshi

పుదుచ్చేరి: కన్నడ సినిమా దర్శకురాలు, నిర్మాత సుమన కిత్తూరు వివాహం చేసుకున్నారు. చిరకాల మిత్రుడైన ఫోటోగ్రాఫర్‌ శ్రీనివాస్‌ను పుదుచ్చేరిలో మనువాడారు. గత కొంత కాలంగా సుమన పుదుచ్చేరిలోనే నివాసముంటున్నారు. షిమోగాలోని ఓ దేవాలయంలో వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒకటైనట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో కేవలం కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన అనంతరం శాశ్వతంగా ఈ జంట బెంగళూరుకు మకాం మార్చనున్నారు. (లాక్‌డౌన్‌ ఉల్లంఘన.. నటుడిపై తుమ్మిన వ్యక్తి! )

అయితే వీరి వివాహం ఏప్రిల్‌ 17 నే జరిగినట్లు సమాచారం. కాగా ఆదివారం(మే 24) పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో పత్యక్షమవడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇక సుమన స్లమ్ బాలా, కిరియురినా గయాలిగలు, ఎడెగారికా వంటి ప్రశంసలు అందుకున​  సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ‘ఆ దినగలు’ చిత్రంతో అసోసియేట్ డైరెక్టర్, గేయ రచయితగా తన వృత్తిని ప్రారంభించిన సుమన.. కల్లారే సాంటే, ఎడెగారికే చిత్రాలకు రెండు కర్ణాటక రాష్ట్ర అవార్డులను గెలుచుకున్నారు. ఆమె సినిమాలు చాలావరకు నేటి కాలంలో ఆధిపత్యం చెలాయించే సామాజిక వ్యతిరేక అంశాలతో కూడుకొని ఉంటాయి. (ఎన్ని రోజులు సింగిల్‌గా ఉంటావో నేనూ చూస్తా: నితిన్‌ )

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top